Watch Video: వామ్మో ఎలుగుబంట్లు..! బెంబేలెత్తుతున్న స్థానికులు..

| Edited By: Srikar T

Jul 26, 2024 | 8:45 PM

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎలుగుబంట్ల దాడులతో అన్నదాతల బెంబేలెత్తిపోతున్నారు. పొలాల్లోకి వెళ్లాలంటేనే జంకుతున్నారు. తాజాగా తెల్లవారుజామున పాల వెంకటాపురంలో పొలం పనులకు వెళ్తున్న రైతులకు ఎలుగుబంటి కనిపించింది. తప్పించుకునే ప్రయత్నంలో రైతులు నానాతంటాలు పడ్డారు. ఎలుగుబంటి రైతుల మీద దాడి చేసేందుకు ప్రయత్నించగా రైతులంతా కలిసి గట్టి గట్టిగా అరుస్తూ.. శబ్దాలు చేస్తూ ద్విచక్ర వాహనాల్లో ఎలుగుబంటిని వెంబడించారు.

Watch Video: వామ్మో ఎలుగుబంట్లు..! బెంబేలెత్తుతున్న స్థానికులు..
Anantapuram
Follow us on

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎలుగుబంట్ల దాడులతో అన్నదాతల బెంబేలెత్తిపోతున్నారు. పొలాల్లోకి వెళ్లాలంటేనే జంకుతున్నారు. తాజాగా తెల్లవారుజామున పాల వెంకటాపురంలో పొలం పనులకు వెళ్తున్న రైతులకు ఎలుగుబంటి కనిపించింది. తప్పించుకునే ప్రయత్నంలో రైతులు నానాతంటాలు పడ్డారు. ఎలుగుబంటి రైతుల మీద దాడి చేసేందుకు ప్రయత్నించగా రైతులంతా కలిసి గట్టి గట్టిగా అరుస్తూ.. శబ్దాలు చేస్తూ ద్విచక్ర వాహనాల్లో ఎలుగుబంటిని వెంబడించారు. దీంతో ఎలుగుబంటి సమీపంలోని కొండల్లోకి పరుగెత్తింది. రెండు రోజుల క్రితం అదే మండలంలోని వెస్ట్ కోడిపల్లిలో ఇద్దరి రైతులపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.

కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కంబదూరు, కుందుర్పి, బ్రహ్మసముద్రం, కళ్యాణదుర్గం మండలాల్లో కొండ ప్రాంతాలు.. అటవీ ప్రాంతాలు అధికంగా ఉండడంతో.. నిత్యం ఏదో ఒక క్రూర జంతువు గ్రామాలు.. పొలాల్లోకి వచ్చి దాడులు చేస్తున్నాయని రైతులు, గ్రామస్తులు వాపోతున్నారు. వన్యప్రాణుల సంరక్షణకు అటవీ శాఖ అధికారులు చొరవ తీసుకోకపోవడంతో.. ఆహారం కోసం మైదాన ప్రాంతాల్లోకి వచ్చి శివారు కాలనీలు, వ్యవసాయ పొలాల్లోకి చొరబడుతున్నాయి అంటున్నారు చుట్టుపక్కల గ్రామస్తులు. ఎలుగుబంట్ల దాడుల నుంచి తమను రక్షించండి మహాప్రభో అంటున్నారు చుట్టుపక్కల గ్రామస్తులు, రైతులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..