Viral: మందు ముఖ్యం బిగిలు..! బార్‌లో పొట్టుపొట్టు కొట్టుకున్నారు.. లాస్ట్ ట్విస్ట్ మాత్రం అదిరిపోయింది

ఒంగోలులోని కేవీయస్‌ బార్‌లో స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బీరు సీసాలతో పరస్పరం దాడులు చేసుకుంటూ బార్‌ను రణరంగంగా మార్చిన యువకులు.. ఒకరికి తీవ్ర గాయాలు చేసిన ఘటన సీసీటీవీలో రికార్డైంది. అయితే చివర్లో జరిగిన ట్విస్ట్ మాత్రం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. అంత పెద్ద గొడవ జరుగుతున్నా.. ఓ యువకుడు మాత్రం నింపాదిగా తన చివరి పెగ్ తాగి కూల్‌గా అక్కడి నుంచి వెళ్లిపోవడం ఇప్పుడు నెట్టింట ట్రోల్స్‌కు కారణమైంది.

Viral: మందు ముఖ్యం బిగిలు..! బార్‌లో పొట్టుపొట్టు కొట్టుకున్నారు.. లాస్ట్ ట్విస్ట్ మాత్రం అదిరిపోయింది
Bar

Edited By:

Updated on: May 27, 2026 | 1:24 PM

ఒంగోలులో పాత మార్కెట్ సమీపంలోని కేవీయస్‌ బార్‌లో మద్యం మత్తులో స్నేహితుల మధ్య ఘర్షణ జరిగింది. బీరు బాటిళ్ళతో ఇరువర్గాలు దాడులు చేసుకున్నాయి.. ఈనెల 23న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది… స్నేహితుల మధ్య చెలరేగిన చిన్నపాటి వివాదం.. చూస్తుండగానే చినికి చినికి గాలి వానలా మారింది. ఈ క్రమంలో ఇరువురు విచక్షణారహితంగా.. దాడి చేసుకున్న దృశ్యాలు బార్‌లో ఉన్న సిసికెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. వివరాల ప్రకారం.. ఒంగోలు ఈమని పాలెంకి చెందిన ప్రేమ్ కుమార్, అజయ్ లు ఇద్దరు బంధుమిత్రులు.. అజయ్ కి, ప్రేమ కుమార్ కి కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి.. అజయ్, ప్రేమ కుమార్‌లతో పాటు వారి స్నేహితులు ఈనెల 23న కేవియస్‌ బార్‌లో కూర్చుని మద్యం తాగుతున్నారు. ఈ సందర్బంగా ఇద్దరి మధ్య పాత గొడవలు ప్రస్తావనకు వచ్చాయి.

ఇరువురి స్నేహితులు అందరూ కలిసి బార్ అండ్ రెస్టారెంట్లో మద్యం తాగుతూ ఉన్న సందర్భంలో ప్రేమ్ కుమార్ ఒక్కసారిగా అజయ్ పై దాడి చేయగా.. మిగిలిన ఇద్దరు స్నేహితులు కూడా బీరు సీసాలతో అతని మీద దాడి చేశారు. ఈ దాడిలో అజయ్ కు తీవ్రమైన గాయాలతో రిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటనకు చెందిన సిసి కెమెరాలోని దృశ్యాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.. అయితే చివరిలో ట్విస్ట్‌ ఏంటంటే ఇంత గొడవ జరిగి, ఒకరికి తీవ్ర గాయాలు అయినా వీరిలో ఓ యువకుడు నింపాదిగా బార్‌లో చివరి పెగ్‌ కలుపుని తీరిగ్గా తాగి అక్కడి నుంచి వెళ్ళిపోవడం… గొడవ ఎంత పెద్దదైనా చివరి పెగ్‌లో ఉన్న కిక్కే వేరప్పా అనుకుంటూ ఆ యువకుడు కులాసాగా మందు తాగి వెళ్ళినపోయిన దృశ్యాలపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us