Rain Alert: ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్.. వాతావరణశాఖ లేటెస్ట్ అప్డేట్..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ వర్షసూచన జారీ చేసింది. తూర్పు తెలంగాణ, కోస్తా ఆంధ్రప్రదేశ్‌పై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు పడే అవకాశమంది. రాబోయే మూడ్రోజుల పాటు పలు ప్రాంతాల్లో మోస్తరు వానలు పడతాయని తెలిపింది. తాజా వెదర్ రిపోర్ట్ చూద్దాం.

Rain Alert: ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్.. వాతావరణశాఖ లేటెస్ట్ అప్డేట్..
Weather Report

Updated on: Nov 06, 2026 | 1:29 PM

తూర్పు తెలంగాణ, దానిని ఆనుకుని ఉన్న కోస్తా ఆంధ్రప్రదేశ్‌పై నిన్నటి ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ప్రస్తుతం సగటు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. వీటి ఫలితంగా ఏపీలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలను అమరావతి వాతావరణ కేంద్రం జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే మూడ్రోజుల పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటికే మురసు తుఫాన్ ప్రభావంతో ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇక రోడ్లు దెబ్బతినగా.. విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. దీంతో వీటిని పునరుద్దరించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో మరో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో  ఏపీలో రాబోయే రోజుల్లో వర్షాలు మరింతగా పడతాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.

రాబోయే మూడ్రోజులు ఎలా ఉంటుందంటే..

కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30-40 గరిష్ఠంగా 50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. ఇక రాయలసీమ జిల్లాల్లో ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.

తెలంగాణలో వర్షాలకు ఛాన్స్

తెలంగాణలో వాతావరణం మారనుంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా నివేదికను విడుదల చేసింది, దీని ప్రకారం శుక్రవారం, శనివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. వర్షాలతో పాటు, అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షాలు కురిసే ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చనిహెచ్చరించింది. ప్రయాణించే వారు, వ్యవసాయదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Loading...
Unable to load recommendations.
Follow Us