AP Panchayat Elections 2021: కుల ధ్రువపత్రాలపై అధికారులకు ఎస్​ఈసీ కీలక ఆదేశాలు.. అవి కూడా తీసుకోవాలని సూచన

|

Jan 30, 2021 | 4:48 PM

కుల ధ్రువపత్రాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ అధికారులకు కీలక సూచనలు చేశారు. కొత్తవాటి కోసం ఇబ్బంది పెట్టవద్దని.. ఇప్పటికే ఉన్న కుల ధ్రువపత్రాలను....

AP Panchayat Elections 2021: కుల ధ్రువపత్రాలపై అధికారులకు ఎస్​ఈసీ కీలక ఆదేశాలు.. అవి కూడా తీసుకోవాలని సూచన
Follow us on

కుల ధ్రువపత్రాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ అధికారులకు కీలక సూచనలు చేశారు. కొత్తవాటి కోసం ఇబ్బంది పెట్టవద్దని.. ఇప్పటికే ఉన్న కుల ధ్రువపత్రాలను సైతం స్వీకరించాలని సూచించారు.  ఈ మేరకు కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లకు నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఆదేశాలు అందాయి. ఇక ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల కుల ధ్రువపత్రాలను త్వరగా ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు.

కాగా  అసాధారణంగా ఏకగ్రీవాలు మంచిది కాదని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చెప్పారు.  ఏకగ్రీవాలపై షాడో టీమ్స్ ఫోకస్ ఉంటుందని హెచ్చరించారు. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలప్పుడు పోటీ చెయ్యాలని ఆరాటపడే పార్టీలు.. పంచాయతీ ఎన్నికలప్పుడు మాత్రం ఏకగ్రీవాల పట్ల చొరవ చూపడం ఎంతవరకు సమంజసమన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఎన్నికల్లో భాగస్వామ్యం అయినప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుందని, మెరుగైన ఫలితాలు ఉంటాయన్నారు. స్థానిక ప్రజల అందరూ కలిసి నిర్ణయించే ఏకగ్రీవాలకు ఎస్​ఈసీ ఏమాత్రం వ్యతిరేకం కాదని వెల్లడించారు.

Also Read:

AP Local Body Elections 2021: ఏపీ పంచాయతీ పోలింగ్ తేదీల్లో సెలవులు.. మద్యం షాపులు క్లోజ్.. పూర్తి వివరాలు

ఏపీలో జోరందుకున్న నామినేషన్లు. సర్పంచ్ స్థానానాలకు నామినేషన్ ల దాఖలు కోసం తరలివస్తున్న అభ్యర్థులు..