AP Local Body Polls: స్థానిక ఎన్నికలపై సింగిల్​ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్‌కు అప్పీల్‌ చేసిన ఎస్ఈసీ

|

Jan 11, 2021 | 8:31 PM

ఆంధ్రప్రదేశ్‌లో  పంచాయతీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్‌లో రాష్ట్ర ఎన్నికల సంఘం అప్పీల్‌  చేసింది. సింగిల్ బెంచ్ తీర్పు అత్యున్నత న్యాయస్థానం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది.

AP Local Body Polls: స్థానిక ఎన్నికలపై సింగిల్​ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్‌కు అప్పీల్‌ చేసిన ఎస్ఈసీ
Follow us on

AP Local Body Polls:  ఆంధ్రప్రదేశ్‌లో  పంచాయతీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్‌లో రాష్ట్ర ఎన్నికల సంఘం అప్పీల్‌  చేసింది. సింగిల్ బెంచ్ తీర్పు అత్యున్నత న్యాయస్థానం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. అత్యవసర పిటిషన్‌గా భావించి విచారించాలని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది కోరారు.

ఏపీలో రాష్ట్ర ఎన్నికల సంఘం వెలువరించిన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్​ను హైకోర్టు నిలిపివేసిన సంగతి తెలిసిందే. వాక్సినేషన్‌కు ఎన్నికల ప్రక్రియ అడ్డు వస్తుందని ధర్మాసనం భావించింది. ఈ క్రమంలో ఎస్‌ఈసీ విడుదల చేసిన షెడ్యూల్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ ఎన్నికల షెడ్యూల్‌ను కొట్టివేస్తున్నట్టు ధర్మాసనం వెల్లడించింది. నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రభుత్వ అభిప్రాయాలను ఎస్ఈసీ పరిగణలోకి తీసుకోలేదని హైకోర్టు పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, 21లను ఉల్లంఘించేలా ఎస్‌ఈసీ నిర్ణయం ఉందని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఏకకాలంలో ఎన్నికలు, కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలు కష్టతరమని ప్రభుత్వం తరపున రెండు గంటలపాటు అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ఎన్నికల సంఘం డివిజనల్‌ బెంచ్‌లో అప్పీల్ చేసింది.

Also Read :

AP Local Body Polls: ఏపీ పంచాయితీ ఎన్నికల షెడ్యూల్‌ను సస్పెండ్ చేసిన హైకోర్టు.. ప్రజారోగ్యం దృష్టిలో పెట్టుకున్నట్లు వెల్లడి

Andhra Pradesh Ration: ఏపీలో ఇకపై ఓటీపీ చెబితేనే రేషన్.. ఫిబ్రవరి నుంచి అమల్లోకి కొత్త విధానం..