నిమ్మగడ్డ లేఖలను లైట్‌ తీసుకున్న మంత్రి.. లేఖలు రాయడం ఆయనకు అలవాటేనన్న పేర్ని నాని

|

Jan 29, 2021 | 4:26 PM

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల సంఘం కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై వైసీపీ ఎంపీలు, మంత్రులు తీవ్ర స్థాయిలో ఫైర్‌ అవుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో సీనియర్‌ అధికారులపై..

నిమ్మగడ్డ లేఖలను లైట్‌ తీసుకున్న మంత్రి.. లేఖలు రాయడం ఆయనకు అలవాటేనన్న పేర్ని నాని
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల సంఘం కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై వైసీపీ ఎంపీలు, మంత్రులు తీవ్ర స్థాయిలో ఫైర్‌ అవుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో సీనియర్‌ అధికారులపై బదిలీ వేటు వేస్తూ కేంద్రానికి లేఖలు పంపారు నిమ్మగడ్డ. అంతే కాదు తాజాగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఆ పదవి నుంచి తొలగించాలని కూడా లేఖ రాశారు.

ఇలా నిమ్మగడ్డ వరుస లేఖలు రాయడం పట్ల వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో భగ్గుమంటున్నారు. చంద్రబాబు ఏజెంట్‌గా ఎస్‌ఈసీ వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరో మంత్రి పేర్ని నాని మాత్రం నిమ్మగడ్డ లేఖలను లైట్‌ తీసుకున్నారు.

లేఖలు రాయడం నిమ్మగడ్డ రమేష్‌కు అలవాటేనన్నారు మంత్రి పేర్ని నాని. ఎన్నికల పంచాయితీపై తనదైన శైలిలో స్పందించిన పేర్ని నాని నిమ్మగడ్డ లేఖలపై అంతగా స్పందించాల్సిన అవసరం లేదని కొట్టి పారేశారు. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ చేయాల్సిన పని చేయకుండా అధికారుల బదిలీలపై లేఖలు రాస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు.

 

ఎస్‌ఈసీ నిమ్మగడ్డపై సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్‌.. చంద్రబాబు ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారన్న ప్రభుత్వ సలహాదారు

 

కాకినాడ నామినేషన్లలో వాలంటీర్ల సందడి.. ఎన్నికల సంఘం నిబంధనలు పట్టించుకోని అధికారులు