Kodali Nani: నేను నూతన కేబినెట్ లో ఉండే అవకాశం తక్కువ.. మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు

|

Apr 07, 2022 | 7:01 PM

ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌ ఆధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం(Cabinet Meeting) ముగిసింది. సమావేశం ముగిసిన వెంటనే 24 మంది మంత్రులు తమ రాజీనామా లేఖలను సీఎంకు అందజేశారు. ఈ క్రమంలో ఈ నెల 11న కొత్త మంత్రిమండలి...

Kodali Nani: నేను నూతన కేబినెట్ లో ఉండే అవకాశం తక్కువ.. మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు
Kodali Nani Latest
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌ ఆధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం(Cabinet Meeting) ముగిసింది. సమావేశం ముగిసిన వెంటనే 24 మంది మంత్రులు తమ రాజీనామా లేఖలను సీఎంకు అందజేశారు. ఈ క్రమంలో ఈ నెల 11న కొత్త మంత్రిమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీ కేబినెట్ ముగిసిన అనంతరం రాజీనామాల సమర్పణపై మంత్రి కొడాలి నాని(Minister Kodali Nani) స్పందించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(CM Jagan) ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. సీఎం నిర్ణయానికి ప్రతి ఒక్కరం కట్టుబడి ఉన్నామన్న మంత్రి.. మొత్తం 24 మంది మంత్రులు రాజీనామా సమర్పించినట్లు తెలిపారు. ఏప్రిల్‌ 11వ తేదీన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఒక అశయం, సిద్ధాంతం కోసం పనిచేస్తున్నారని కొడాలి నాని ప్రశంసించారు. కొత్త కాబినేట్‌లో మీరు కొనసాగే అవకాశం ఉందా అని ప్రశ్నించగా..తనకు తక్కువ అవకాశాలు ఉన్నట్లు కొడాలి నాని తెలిపారు.

సీఎం సారథ్యంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లినందుకు సంతృప్తిగా ఉంది. శక్తి వంచన లేకుండా పార్టీ బలోపేతం కోసం అందరం కలిసి పనిచేస్తున్నారు. సామాజిక సమీకరణాల కారణంగా పాత మంత్రుల్లో అయిదారుగురు కేబినెట్‌లో కొనసాగే అవకాశం ఉంది. అనుభవం రీత్యా కొంతమందిని కొనసాగిస్తున్నట్లు సీఎం జగన్‌ చెప్పారు.

                      – కొడాలి నాని, ఏపీ మంత్రి

Also Read

Tata Neu App: పేమెంట్స్ నుంచి పర్చేజ్ దాకా.. సినిమాలూ.. ట్రావెలింగ్ అన్నీ ఒకే చోట.. టాటా సూపర్ యాప్

Chandrababu: విద్యుత్ కోతలతో జనం నరకం చూస్తున్నారు.. వీడియో షేర్ చేసిన చంద్రబాబు..

Income Tax: మన దేశంలో టాక్స్ కట్టని వారు ఎందరో తెలుసా? వారి బకాయిలు ఎన్ని లక్షల కోట్లంటే..