Andhra Pradesh: పవన్‌కు, కేఏపాల్‌కి తేడా లేదు.. జనసేనానిపై బొత్స సత్యనారాయణ సెటైర్‌.

|

Jan 26, 2023 | 8:51 PM

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో పొత్తుల అంశం రసవత్తరంగా సాగుతోంది. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పొత్తులపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి. పవన్‌ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలోనే పవన్‌ వర్సెస్‌ వైసీపీ నాయకులు అన్నట్లు పరిస్థితులు మారాయి...

Andhra Pradesh: పవన్‌కు, కేఏపాల్‌కి తేడా లేదు.. జనసేనానిపై బొత్స సత్యనారాయణ సెటైర్‌.
Botsa Vs Pawankalyan
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో పొత్తుల అంశం రసవత్తరంగా సాగుతోంది. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పొత్తులపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి. పవన్‌ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలోనే పవన్‌ వర్సెస్‌ వైసీపీ నాయకులు అన్నట్లు పరిస్థితులు మారాయి. వైసీపీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడండి అంటూ పవన్‌ చేసిన కామెంట్లపై మంత్రి బొత్స సత్యనారాయణ ఘూటుగా స్పందించారు. కేఏపాల్‌కి, పవన్‌కి తేడా కనిపించడం లేదంటూ సెటైర్లు విసిరారు.

ఇక పొత్తులపై పవన్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి స్పందించారు. ఇంతకీ సీఎం అభ్యర్థి ఎవరో తేల్చండి అంటూ సజ్జల సూటిగా ప్రశ్నించారు. అధికారంలోకి రావడానికి తాను ఇన్ని సీట్లలో పోటీచేస్తానని.. పవన్‌ ఎందుకు చెప్పడం లేదని.. సజ్జల ప్రశ్నించారు. పొత్తుల గురించి మూడు ఆప్షన్లు చెప్పిన పవన్‌.. మరి నాలుగో ఆప్షన్‌ మరిచిపోయాడా? అని ప్రశ్నించారు. 2014 మాదిరిగా చంద్రబాబుకు సపోర్టు చేస్తామని ఎందుకు చెప్పలేకపోయాని నిలదీశారు. పవన్‌ సేట్‌మెంట్లు చూస్తే ఆశ్చర్యంగా ఉందన్నారు.

ఇదిలా ఉంటే గణతంత్ర దినోత్సవం రోజు పొలిటికల్‌ హీట్‌ను పెంచారు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌. తన పంచ్‌ డైలాగ్‌లతో అధికార వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల కోసం తన విధానం ఉంటుందన్నారు. జనం ఒప్పుకుంటే తాను సీఎం అవుతానన్నారు. లేదంటే పోరాటాన్ని కొనసాగిస్తానని తేల్చి చెప్పారు. మొన్నటి ఎన్నికల్లో ఓటమి కన్నా పెద్ద అవమానం ఇంకేమీ ఉండదని వ్యాఖ్యానించారు. రాజకీయ వ్యూహాలను తనకు వదిలేయాలని పవన్‌ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..