Andhra Pradesh: ఏపీలో శాసన మండలి రద్దు అంశంపై కేంద్రం నుంచి లేటెస్ట్ అప్డేట్..

|

Jul 29, 2021 | 5:28 PM

Kiran Rijiju: ఆంధ్రప్రదేశ్‌లో శాసనమండలి రద్దు అంశం ఇప్పటికే.. అధికారంలోని వైఎస్ఆర్‌సీపీ, ప్రతిపక్షంలోని టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ అంశంపై

Andhra Pradesh: ఏపీలో శాసన మండలి రద్దు అంశంపై కేంద్రం నుంచి లేటెస్ట్ అప్డేట్..
Kiran Rijiju
Follow us on

Kiran Rijiju: ఆంధ్రప్రదేశ్‌లో శాసనమండలి రద్దు అంశం ఇప్పటికే.. అధికారంలోని వైఎస్ఆర్‌సీపీ, ప్రతిపక్షంలోని టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ అంశంపై టీడీపీ ఎంపీ కనకమేడల రాజ్యసభలో ప్రశ్నించారు. దీనికి కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. శాసన మండలి రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించినట్లు వెల్లడించారు. శాసన మండలి రద్దు అంశం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని రిజిజు వివరించారు. శాసనమండలి రద్దుపై తీర్మానం చేసిన ప్రభుత్వం దాన్ని ఈ ఏడాది జనవరిలో కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే.

అయితే.. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందినా, మండలిలో విముఖత వ్యక్తమైంది. మండలిలో టీడీపీకే బలం ఎక్కువగా ఉండటంతో ఆమోదం పొందలేకపోయింది. పలు బిల్లులు అసెంబ్లీ ఆమోదానికి నోచుకున్నా, మండలిలో అడ్డంకులు ఎదురయ్యేవి. ఈ నేపథ్యంలో ఏపీలోని వైఎస్ జగన్ సర్కార్.. మండలిని రద్దు చేయాలంటూ బిల్లు రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. అయితే ఇటీవల కొత్త ఎమ్మెల్సీలు రావడంతో మండలిలో వైసీపీ బలం పెరిగింది. అయితే.. ఈ క్రమంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుదనేది చర్చనీయాంశంగా మారింది.

అయితే.. ఇంతకు ముందు చెప్పిన విధంగానే.. వైఎస్ జగన్ సర్కార్ మండలిని రద్దు చేయాలని పేర్కొంటుందా..? లేక మండలిని కొనసాగించే ప్రయత్నం చేస్తుందా అనేది వేచిచూడాల్సిందే.

Also Read:

Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ పార్టీలో చేరితే లాభమా?.. నష్టమా..? కాంగ్రెస్ సీనియర్ల సమాలోచన..

AP Crime News: తాడేపల్లిలో ఓ ఇంట్లో నుంచి దుర్వాసన.. తాళాలు పగులగొట్టి తెరిచి చూడగా..