Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ పార్టీలో చేరితే లాభమా?.. నష్టమా..? కాంగ్రెస్ సీనియర్ల సమాలోచన..

Congress Party: ఢిల్లీ రాజకీయాలు కొన్ని రోజుల నుంచి వేగంగా మారుతున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు.. 2024 జరగనున్న

Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ పార్టీలో చేరితే లాభమా?.. నష్టమా..? కాంగ్రెస్ సీనియర్ల సమాలోచన..
Prashant Kishor
Follow us

|

Updated on: Jul 29, 2021 | 5:15 PM

Congress Party: ఢిల్లీ రాజకీయాలు కొన్ని రోజుల నుంచి వేగంగా మారుతున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు.. 2024 జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై ఇప్పటికే ప్రధాన పార్టీలు దృష్టిసారించాయి. ఈ క్రమంలో రాజకీయ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. కాంగ్రెస్ నేతలతో సమావేశం కావడంతో హస్తిన రాజకీయాలు మరింత వేడెక్కాయి. పీకే కాంగ్రెస్‌లోకి చేరుతున్నట్లు ఊహగానాలు మొదలయ్యాయి. ప్రశాంత్ కిషోర్.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో భేటీ అనంతరం.. కాంగ్రెస్‌లో చేరికపై ఇంతవరకు స్పష్టమైన ప్రకటన చేయలేదు. కానీ కాంగ్రెస్ వర్గాలు మాత్రం.. ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు మార్గం సుగుమం అయినట్లు పేర్కొంటున్నాయి.

ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరికపై కాంగ్రెస్ సీనియర్ నాయకుల బృందం వారం క్రితం రాహుల్ గాంధీ అధ్యక్షతన ఒక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో కమల్ నాథ్, మల్లికార్జున్ ఖర్గే, ఏకే ఆంటోనీ, అజయ్ మాకెన్, ఆనంద్ శర్మ, హరీష్ రావత్, అంబికా సోని, కెసి వేణుగోపాల్ వంటి సీనియర్ నాయకులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ గురించే చర్చించినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే.. ప్రశాంత్ కాంగ్రెస్‌లోకి చేరితేనే మంచిదని సీనియర్లు.. రాహుల్ గాంధీతో పేర్కొన్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

కాంగ్రెస్ పార్టీ వ్యూహ ప్రతివ్యూహాలకు ప్రశాంత్ సరిపోతారా అనే దానిపై సీనియర్లంతా చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆయన చేరితే పార్టీకు లాభం చేకూరుతుందా..? లేక నష్టం చేకూరుతుందా అనే దానిపై చర్చించినట్లు ఓ సీనియర్ నేత జాతీయ ఛానెల్‌కు పంచుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే.. పీకే ప్లాన్, సలహాలు సూచనలు బీజేపీ కట్టడికి ఎంతవరకు ఉపయోగపడతాయన్న విషయంపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. అయితే.. చాలా మంది పీకేతో పార్టీకి లాభం చేకూరుతుందని అభిప్రాయం వ్యక్తంచేసినట్లు సమాచారం.

కాగా.. ప్రశాంత్ కిషోర్.. ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌ను ఇటీవల రెండు సార్లు కలిశారు. అనంతరం.. ఆయన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, సోనియాగాంధీను కలిశారు. ఈ సందర్భంగా 2024 లోక్‌సభ ఎన్నికల గురించి, కాంగ్రెస్ ప్రణాళికపై వారు చర్చించినట్లు సమాచారం. అనంతరం పవార్ రాష్ట్రపతి రేసులో ఉన్నారన్న వార్తలు వెలువడ్డాయి. అనంతరం పవార్ ప్రధాని మోదీతో భేటీ కావడం సర్వత్రా చర్చకు దారితీసింది.

Also Read:

చైనా కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాలకు హాజరైన సీతారాం ఏచూరి, డి.రాజా.. తప్పేముందని వ్యాఖ్య

పెగాసస్ వివాదంపై విచారణకు కమిషన్ ఏర్పాటు..బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిర్ణయంపై శివసేన హర్షం