AP News: గుడ్ న్యూస్.. ఏపీలో కందిపప్పు, చక్కెర ధరలు తగ్గింపు.. వివరాలు ఇవిగో

|

Oct 02, 2024 | 1:13 PM

కందిపప్పు, చక్కెర ధరలు భారీగా తగ్గించి శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అయితే, ఈ నిర్ణయంతో రేషన్‌కార్డు ఉన్నవారికే లబ్ధిచేకూరనుంది.. ఎందుకంటే.. రాష్ట్ర ప్రజలకు పౌరసరఫరాల శాఖ.. కందిపప్పు, చక్కెర ధరలను తగ్గించింది.

AP News: గుడ్ న్యూస్.. ఏపీలో కందిపప్పు, చక్కెర ధరలు తగ్గింపు.. వివరాలు ఇవిగో
చక్కెర మీ శరీరంలో మంటను కలిగిస్తుంది. ఇది కీళ్ల నొప్పులు, ఇతర తాపజనక సమస్యలకు దారితీస్తుంది. చక్కెర మీ నిద్రకు కూడా భంగం కలిగిస్తుంది. దీంతో నిద్ర పట్టడం కష్టమవుతుంది. మీకు ఈ లక్షణాలలో దేనినైనా అనుభవిస్తే, ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించండి. అలాగే వెంటనే స్వీట్లు తీసుకోవడం తగ్గించండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. స్వీట్లు తినాలనుకున్నప్పుడు దానికి బదులు ఇతర పదార్థాలు తినడానికి ట్రై చేయాలి.
Follow us on

నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని తాకుతున్న వేళ.. ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ అందించింది రాష్ట్ర ప్రభుత్వం. కందిపప్పు, చక్కెర ధరలు భారీగా తగ్గించి శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అయితే, ఈ నిర్ణయంతో రేషన్‌కార్డు ఉన్నవారికే లబ్ధిచేకూరనుంది.. ఎందుకంటే.. రాష్ట్ర ప్రజలకు పౌరసరఫరాల శాఖ.. కందిపప్పు, చక్కెర ధరలను తగ్గించింది. నెల వ్యవధిలోనే రెండు సార్లు కందిపప్పు ధరలను తగ్గించారు. బహిరంగ మార్కెట్‌లో కిలో కందికప్పు ధర క్వాలిటీని బట్టి.. రూ.150.. రూ.160.. రూ.170 ఇలా పలుకుతుండగా.. దాయితపై కిలో కందిపప్పును రూ.67కే అందించనుంది ప్రభుత్వం.. మరోవైపు.. కిలో షుగర్‌ ధర.. బహిరంగ మార్కెట్‌లో రూ.50కి పైగా పలుకుతుండగా.. రూ.17 అరకిలో చక్కెర పంపిణీకి పౌరసరఫరాల శాఖ శ్రీకారం చుట్టనుంది.. నిత్యావసరాల ధరలను కంట్రోల్ చేసేలా చర్యలకు ఉపక్రమించింది ఏపీ ప్రభుత్వం.. తక్కువ ధరలకు రేషన్ షాపుల్లో కందిపప్పు.. షుగర్‌ విక్రయించాలని నిర్ణయం తీసుకున్నారు. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో.. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో ఏపీ ప్రభుత్వం ఈ నెల నుంచే కందిపప్పు, షుగర్‌ను పంపణీ చేస్తోంది. ఇక, గోధుమపిండితో పాటుగా రాగులు, జొన్నల్ని కూడా రేషన్‌తో పాటూ అందించేందుకు కసరత్తు చేస్తోంది ప్రభుత్వం.

ఇది చదవండి: గుడ్‌న్యూస్.! ఏపీకి తొలి వందే మెట్రో.. ఏ రూట్‌లోనంటే.?

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..