Andhra Pradesh: హైకోర్టు మెట్లెక్కిన ఆంధ్రప్రదేశ్ డీజీపీ.. పీడీఎస్‌ రైస్ కేసుల్లో వివరణ.. అసలేమైందంటే..?

|

Oct 01, 2022 | 7:43 AM

పోలీసుల పరిధి, వ్యవహార శైలిపై మొదట్నుంచీ విమర్శలున్నాయ్‌. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారనే అపవాదూ ఉంది. అధికారం ఉందని ఇష్టానుసారం వ్యవహరిస్తారనే విమర్శలూ ఉన్నాయి.

Andhra Pradesh: హైకోర్టు మెట్లెక్కిన ఆంధ్రప్రదేశ్ డీజీపీ.. పీడీఎస్‌ రైస్ కేసుల్లో వివరణ.. అసలేమైందంటే..?
Rajendranath Reddy
Follow us on

పోలీసుల పరిధి, వ్యవహార శైలిపై మొదట్నుంచీ విమర్శలున్నాయ్‌. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారనే అపవాదూ ఉంది. అధికారం ఉందని ఇష్టానుసారం వ్యవహరిస్తారనే విమర్శలూ ఉన్నాయ్‌. ఇవన్నీ ఆరోపణలు కాదు, నిజాలే అంటారు ప్రజలు. ఇప్పుడు ఏపీ హైకోర్టు అలాంటి కామెంట్సే చేయడం సంచలనం రేపుతోంది. అక్రమంగా తరలిస్తోన్న పీడీఎస్‌ రైస్‌ పట్టుకున్న SI, ASI సస్పెండ్‌ కావాల్సి వచ్చింది. ఇదే కేసులో ఏకంగా ఏపీ డీజీపీ హైకోర్టు మెట్లెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. బియ్యం వ్యాపారులు దాఖలు చేసిన పిటిషన్‌లో ఏపీ డీజీపీ రాజేంధ్రనాథ్‌ రెడ్డి.. హైకోర్టుకు హాజరై వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అక్రమ పీడీఎస్‌ రైస్‌ కేసుల్లో వాహనాలను సీజ్‌ చేయడానికి తప్పుబట్టింది హైకోర్టు. పీడీఎస్‌ రైస్‌ను పట్టుకోండి, కానీ వాహనాన్ని సీజ్‌ చేసే అధికారం మీకు ఎవరిచ్చారంటూ డీజీపీని ప్రశ్నించింది హైకోర్టు. రేషన్‌ బియ్యం అక్రమ రవాణా చట్ట విరుద్ధమే. పీడీఎస్‌ రైస్‌ అక్రమ రవాణా జరిగితే బియ్యాన్ని సీజ్ చేయడండి, కానీ వాహనాన్ని మాత్రం నిబంధనల విడిచిపెట్టాలని ఆదేశించింది న్యాయస్థానం.

ఈ కేసు కర్నూలు జిల్లాకు సంబంధించినది. పౌరసరఫరాల శాఖ, పోలీసులు నిర్వహించిన దాడుల్లో రేషన్ బియ్యం వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో రైస్ మిల్లు యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారని కోర్టులో పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పోలీసులు పాటించలేదని వివరించడంతో డీజీపీ కోర్టుకు హాజరవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా న్యాయస్థానం పలు సూచనలు చేయడంతోపాటు.. వాహనాన్ని సీజ్‌చేసే అధికారం ఎవరిచ్చారంటూ డీజీపీని ప్రశ్నించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..