Pawan Kalyan: ఉప్పాడలో పర్యటించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్.. కోతకు గురవుతున్న తీర ప్రాంతం పరిశీలన

|

Jul 03, 2024 | 3:07 PM

కాకినాడ జిల్లా ఉప్పాడ తీరప్రాంతంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. పవన్‌కు స్థానికులు, అధికారులు స్వాగతం పలికారు. మధ్యలో ఉన్న సూరప్ప తాగునీటి చెరువును కూడా సందర్శించారు. నాబార్డు నిధులతో 22 ఎకరాల్లో నిర్మించిన ఈ ట్యాంకు ద్వారా యు. కొత్తపల్లి మండల పరిధిలోని 54 గ్రామాలకు అందిస్తున్నారు.

Pawan Kalyan: ఉప్పాడలో పర్యటించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్.. కోతకు గురవుతున్న తీర ప్రాంతం పరిశీలన
Pawan Kalyan In Uppada
Follow us on

కాకినాడ జిల్లా ఉప్పాడ తీరప్రాంతంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. పవన్‌కు స్థానికులు, అధికారులు స్వాగతం పలికారు. మధ్యలో ఉన్న సూరప్ప తాగునీటి చెరువును కూడా సందర్శించారు. నాబార్డు నిధులతో 22 ఎకరాల్లో నిర్మించిన ఈ ట్యాంకు ద్వారా యు. కొత్తపల్లి మండల పరిధిలోని 54 గ్రామాలకు అందిస్తున్నారు. ఉప్పాడలో కోతకు గురవుతున్న తీర ప్రాంతాన్ని పరిశీలించిన పవన్ కల్యాణ్‌కు వ్యూ పాయింట్ దగ్గర పలు అంశాలను అధికారులు వివరించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను పవన్ కల్యాణ్ తిలకించారు.

ఉప్పాడ నుంచి కాకినాడకు వెళ్లే రోడ్డు మార్గాన్ని విశాఖ తరహాలో సుందరంగా తీర్చిదిద్దాలనే ఆలోచన ఉందని పవన్ అధికారులకు తెలిపారు. అటవీశాఖ అధికారులు అక్కడి పరిస్థితులను పవన్ కల్యాణ్‌కు వివరించారు. ఇక హోప్ ఐలాండ్‌ను ఏ రకంగా అభివృద్ధి చేయాలనే అంశంపై కూడా పవన్ అధికారులతో చర్చించారు. వన్యసంపదకు నష్టం జరగకుండా అభివృద్ధి ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు.

ఉప్పాడలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్న మత్స్యకార కుటుంబాలతో కూడా పవన్ మాట్లాడారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్రపు కోతకు గురైన ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్తూ గ్రామ గ్రామాన ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకున్నారు. పిఠాపురం, నవకండ్రవాడ, వాకతిప్ప, యు.కొత్తపల్లి తదితర గ్రామాల్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.ఇక సాయంత్రం ఉప్పాడ సెంటర్‌లో జరగబోయే వారాహి సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించనున్నారు. ఆ తరువాత ఆయన విజయవాడ బయల్దేరి వెళతారు. పవన్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే వర్మ, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఉప్పాడలో పర్యటించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…