Fuel Price in Andhra: పెట్రో ధరలపై కీలక ప్రకటన చేసిన ఏపీ డిప్యూటీ సీఎం…

|

Nov 06, 2021 | 7:01 PM

పెట్రోల్‌ ధరల్లాగే ఏపీలోనూ రాజకీయాలు భగభగ మండుతున్నాయి. కేంద్రం తగ్గించినా.. ఏపీ ఎందుకు ఫాలో కావడం లేదని ఆందోళనబాటు పట్టాయి కమలదళం.

Fuel Price in Andhra: పెట్రో ధరలపై కీలక ప్రకటన చేసిన ఏపీ డిప్యూటీ సీఎం...
Dharmana Krishna Das
Follow us on

పెట్రోల్‌ ధరల్లాగే ఏపీలోనూ రాజకీయాలు భగభగ మండుతున్నాయి. కేంద్రం తగ్గించినా.. ఏపీ ఎందుకు ఫాలో కావడం లేదని ఆందోళనబాటు పట్టాయి కమలదళం. అయితే మా వ్యవహారాల్లో మీ రుబాబేంటని ప్రశ్నిస్తుంది వైసీపీ. ఏడాదిగా పెంచింది బారెడు.. తగ్గించింది జానడు ఎందుకంత ఫోజులంటూ బీజేపీకి కౌంటర్ వేస్తోంది వైసీపీ.

APలో ధరలు తగ్గిస్తారా? లేదా అంటూ రోడ్డెక్కారు కమలనాథులు. కేంద్రం పన్నులు తగ్గించింది.. 22 రాష్ట్రాలు సైతం వ్యాట్‌లో కోతలు విధించి ప్రజలపై భారం తగ్గించాయి. అయినా వైసీపీ ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదంటూ రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలకు దిగారు బీజేపీ నాయకులు. ప్రతిపక్షంలో ఉండగా అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా ధరలు ఏపీలోనే ఉన్నాయని అధికారంలోకి రాగానే తగ్గిస్తామన్న జగన్‌ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించింది బీజేపీ. దేశంలో అత్యధికంగా పన్నులు విధిస్తున్న రాష్ట్రం ఏపీయేనని.. వెంటనే ప్రజలపై భారం తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్నారు బీజేపీ నాయకులు. అటు లెఫ్ట్‌ పార్టీలతో పాటు ఇటు టీడీపీ కూడా స్వరం పెంచింది. ధరలపై యుద్ధం ప్రకటించాయి పార్టీలు. ఈ నెల9న తెలుగుదేశం పార్టీ పెట్రోల్‌ బంకుల ముందు ధర్నాలు చేయాలని నిర్ణయించింది. కనీసం 16 రూపాయిలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. పెరిగిన పెట్రోలియం ఉత్పత్తుల ధరలు అన్ని రంగాలపై ప్రభావం చూపాయని.. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారంటున్నాయి లెఫ్ట్‌ పార్టీలు. ఏపీ ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్ లపై లీటర్ కు 10 చొప్పున తగ్గించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం గత సంవత్సర కాలంగా లీటర్ పెట్రోల్ పై 36 రూపాయిలు, డీజిల్ పై 25 చొప్పున పెంచిందని గుర్తు చేశారు సీపీఎం నేతలు. కేంద్ర, రాష్ట్రాలు కంటితుడుపు చర్యలతో ప్రజల్ని మభ్యపెడుతున్నాయంది సీపీఎం పాలిట్‌బ్యూరో.

ఏడాదిన్నరగా అడ్డగోలుగా ధరలు పెంచిన కేంద్రం.. నామమాత్రంగా తగ్గించి రాష్ట్రానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయడం ఏంటని ప్రశ్నించారు ఎంపీ మోపిదేవి వెంకటరమణ. రాష్ట్రంలో ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. ఎప్పుడు ఏం చేయాలో సీఎం జగన్‌ బీజేపీ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. ధరలపై కేంద్రం వద్దే తేల్చుకోవాలన్నారు ఎంపీ. అటు ఉప ఎన్నికల్లో వైఫల్యంతో యూపీలో ఎన్నికలు ఉన్నాయని ఓటమి భయంలో ధరలు నామమాత్రంగా తగ్గించి.. రాష్ట్రాలపై ఒత్తిడి పెంచడం ఏంటని ప్రశ్నించారు మోపిదేవి.

ఈ క్రమంలోనే పెట్రో ధరలపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. ప్రజలకు మేలు చేకూర్చేలా మంచి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తాజాగా కేంద్రం ప్రభుత్వం పెట్రో ధరలను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు.

Also Read: ఫన్ బకెట్ భార్గవ్ మళ్లీ అరెస్ట్.. అతి చేస్తే ఇంతే.. పూర్తి వివరాలు

 సామాన్యులకు షాకింగ్ న్యూస్… ఆర్టీసీ ఛార్జీల పెంపుకు రంగం సిద్దం !