Cyclone Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న మరో తుఫాన్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్‌!

ఇప్పటికే ఏపీని రెండు వరుస తుఫాన్‌ను ముంచెత్తాయి. వాటి దెబ్బ నుంచి ఇంకా కోలుకోక ముందే మరో తుఫాన్ ఆంధ్రప్రజలను భయపెడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడం క్రమంగా బలపడుతూ ఈ నెల 16నాటికి తుఫాన్‌గా మారే ఛాన్స్ ఉందని దీని ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాబట్టి ఏ జిల్లాల్లో వర్షాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం.

Cyclone Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న మరో తుఫాన్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్‌!
Cyclone Akwan Alert

Updated on: Nov 13, 2026 | 4:17 PM

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ మరోసారి కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రానికి మరో తుఫాన్‌ ముప్పు పొంచి ఉన్నట్టు పేర్కొంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపుడుతోందని..ఇది ఈ నెల 15 నాటికి వాయుగుండంగా.. 16న తుఫాన్‌గా బలపడే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. ఒక వేళ ఈ అల్పపీడనం తుఫాన్‌గా బలపడితే.. దానికి అక్వాన్‌గా నామకరణం చేయనున్నట్టు తెలిపారు. ఇది తుఫాన్‌ మారిన తర్వాత ఈ నెల 19వ తేదీ సాయంత్రం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెబుతున్నారు.

వీటి ప్రభావంతో రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, కొస్తాంధ్ర రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. మరకొన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణ ఏర్పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఈ నెల 18, 19 తేదీల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కొన్ని ప్రాంతాల్లో గంటకు 40-50 కి.మీ. వేగంతో, అప్పుడప్పుడు 60 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.

ఇక ఈ అల్పపీడం ప్రభావంతో తెలంగాణలో వాతావరణం ఎలా ఉండబోతుందో కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది.హైదరాబాద్‌ వాతావరణ కేంద్ర ప్రకారం.. రాగల మూడు రోజులలో రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో రాబోయే రెండ్రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం నుండి రెండు నుండి మూడు డిగ్రీలు తక్కువగా కొనసాగే అవకాశం ఉందని వాతవారణ వాఖ అంచనా వేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us