AP Corona Cases: ఏపీలో తగ్గిన పాజిటివ్ కేసులు.. పెరిగిన రికవరీ.. వివరాలు ఇలా..

|

Jul 20, 2021 | 5:44 PM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొద్దిగా తగ్గింది. ఒక రోజు పాజిటివ్ కేసులు తగ్గుతుంటే.. మరో రోజు ఆ సంఖ్య పెరుగుతోంది. తాజాగా రోజూవారి నమోదవుతున్న పాజిటివ్ కేసుల...

AP Corona Cases: ఏపీలో తగ్గిన పాజిటివ్ కేసులు.. పెరిగిన రికవరీ.. వివరాలు ఇలా..
AP Corona Updates
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొద్దిగా తగ్గింది. ఒక రోజు పాజిటివ్ కేసులు తగ్గుతుంటే.. మరో రోజు ఆ సంఖ్య పెరుగుతోంది. తాజాగా రోజూవారి నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గింది. గడిచిన 24 గంటల్లో 88,149 శాంపిల్స్ పరీక్షించగా.. 2,498 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 19,41,327కి చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 23,843 ఉండగా.. 1904306 మంది వైరస్ నుంచి కోలుకుని వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ఇదిలా ఉంటే నిన్న 2,201 మంది రికవరీ కాగా, 24 మంది కోవిడ్ కారణంగా మృతి చెందారు. దీనితో ఇప్పటిదాకా కరోనాతో మరణించిన వారి సంఖ్య 13,178కి చేరుకుంది. కోవిడ్ వల్ల చిత్తూర్‌లో ఐదుగురు, ప్రకాశంలో నలుగురు, నెల్లూరులో ముగ్గురు, పశ్చిమ గోదావరిలో ముగ్గురు, అనంతపూర్‌లో ఇద్దరు, తూర్పు గోదావరిలో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, కృష్ణలో ఒక్కరు, కర్నూల్‌లో ఒక్క రు, శ్రీకాకుళంలో ఒక్కరు మరణించారు.

ఇక జిల్లాల వారీగా నమోదైన కేసులు.. అనంతపురం73, చిత్తూరు 245, తూర్పుగోదావరి 481, గుంటూరు 181, కడప 68, కృష్ణ 263, కర్నూలు 24, నెల్లూరు 233, ప్రకాశం 336, శ్రీకాకుళం 56, విశాఖపట్నం 179, విజయనగరం 33, పశ్చిమ గోదావరి 326 కేసులు నమోదయ్యాయి.

కోవిడ్ ఆంక్షలు మరో వారం..

కోవిడ్‌ అంక్షల్లో భాగంగా మరో వారం రోజుల పాటు నైట్‌ కర్ఫ్యూ కొనసాగించాలని సీఎం జగన్ ఆదేశించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు ఉంటాయని అన్నారు. కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ తప్పనిసరిగా పాటించాలి ప్రజలను కోరారు. జన సమూహాల ఉన్నచోట ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు.

ఇవి కూడా చదవండి: CM Jagan: మరో వారం రోజుల పాటు నైట్‌ కర్ఫ్యూ.. క్లారిటీ ఇచ్చిన ముఖ్యమంత్రి

Farmers Profit: రైతులకు మరో గుడ్ న్యూస్.. వరిగడ్డిని బంగారంగా మార్చే గోల్డెన్ ప్లాన్..