AP Corona Cases: ఆ మూడు జిల్లాల్లో తగ్గని కరోనా.. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు ఎన్నంటే.!

|

Jul 05, 2021 | 7:10 PM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతున్నా.. మూడు జిల్లాల్లో మాత్రం వైరస్ వ్యాప్తి ఇంకా అదుపులో రాలేదు...

AP Corona Cases: ఆ మూడు జిల్లాల్లో తగ్గని కరోనా.. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు ఎన్నంటే.!
Coronavirus Cases In AP
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతున్నా.. మూడు జిల్లాల్లో మాత్రం వైరస్ వ్యాప్తి ఇంకా అదుపులో రాలేదు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య ఇంకా తగ్గకపోగా.. చిత్తూరులో కరోనా కేసులు, మరణాలు ఇంకా తగ్గుముఖం పట్టలేదు. తాజాగా ఈ మూడు జిల్లాల్లోనే మరోసారి ఎక్కువ కేసులు నమోదయ్యాయి.

ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో కొత్తగా 2100 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 19,05,023 కరోనా కేసులు నమోదు కాగా.. ఇందులో 33,964 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక నిన్న 3,435 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కావడంతో.. రికవరీ కేసుల సంఖ్య 18,58,189కి చేరింది. అటు ఆదివారం వైరస్ కారణంగా 24 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 12,870కి చేరింది.

మరోవైపు నిన్న జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.. అనంతపురం 60, చిత్తూరు 316, తూర్పుగోదావరి 583, గుంటూరు 128, కడప 151, కృష్ణ 114, కర్నూలు 50, నెల్లూరు 160, ప్రకాశం 176, శ్రీకాకుళం 48, విశాఖపట్నం 75, విజయనగరం 22, పశ్చిమ గోదావరి 217 కేసులు నమోదయ్యాయి.

Also Read: 

మందుబాబులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో తగ్గనున్న బీర్ల ధరలు.. వివరాలివే.!

మెడలో పాముతో వృద్ధుడు సైకిల్‌పై సవారీ.. వీడియో చూస్తే మీరూ ఔరా అనాల్సిందే!