Andhra Pradesh: ఆటో డ్రైవర్‌ తలుపు తట్టిన అదృష్టం.. ముఖ్యమంత్రి బహుమానం..

అతనొక ఆటో డ్రైవర్. అదృష్టవశాత్తూ ఆ ఆటోడ్రైవర్ ముఖ్యమంత్రితో మాట్లాడే అవకాశం కలిగింది. అవకాశం కలిగింది కదా అని ఆత్రంగా ప్రవర్తించలేదు..కష్టపడి తాను ఆటో తోలుకుంటూ పిల్లలని ఎలా చదివిస్తున్నాడో వివరించారు. దాంతో ఆయన నిజాయతీ నీ, కష్టాన్ని ప్రశంసించిన చంద్రబాబు అతనికి మెరుగైన జీవన ప్రమాణాలు కపించాలని అనుకున్నాడు..

Andhra Pradesh: ఆటో డ్రైవర్‌ తలుపు తట్టిన అదృష్టం.. ముఖ్యమంత్రి బహుమానం..
Andhra Pradesh
Follow us

| Edited By: Narender Vaitla

Updated on: Aug 17, 2024 | 10:12 PM

అతనొక ఆటో డ్రైవర్. అదృష్టవశాత్తూ ఆ ఆటోడ్రైవర్ ముఖ్యమంత్రితో మాట్లాడే అవకాశం కలిగింది. అవకాశం కలిగింది కదా అని ఆత్రంగా ప్రవర్తించలేదు..కష్టపడి తాను ఆటో తోలుకుంటూ పిల్లలని ఎలా చదివిస్తున్నాడో వివరించారు. దాంతో ఆయన నిజాయతీ నీ, కష్టాన్ని ప్రశంసించిన చంద్రబాబు అతనికి మెరుగైన జీవన ప్రమాణాలు కపించాలని అనుకున్నాడు. డీజల్ ఆటో బదులు ఎలక్ట్రిక్ ఆటో ఇస్తానని హామీ ఇచ్చారు. గంటల వ్యవధిలో హామీ నిలబెట్టుకున్నారు. అత్యంత ఆసక్తి కలిగించే ఈ స్టోరీ ఒకసారి చూడండి.

ఆగష్టు 15 న అన్న క్యాంటీన్‌ల పునః ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గుడివాడలో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ ఆటో డ్రైవర్ తో ముఖ్యమంత్రి ముచ్చటించారు. ఆటో డ్రైవర్ జీవన సరళిని, కష్టాలను తెలుసుకున్నారు. ఆ కష్టాలు తీరాలంటే ఏం కావాలని నేరుగానే అడిగారు. దాంతో ఆ ఆటోడ్రైవర్ తన మెరుగైన జీవితం కోసం ఏం కావాలో నిర్మొహమాటంగా చెప్పారు. అది విన్న బాబు ఇచ్చిన హామీ ఏంటో తెలుసా.

ఆటో డ్రైవర్ రజనీకాంత్ చెప్పిందేంటంటే..

కృష్ణా జిల్లా గుడివాడ మండలం వలివర్తిపాడుకు చెందిన ఆటో డ్రైవర్‌ రేమల్లి రజినీకాంత్‌ ఆగష్టు 15 న గుడివాడ లో అన్నా క్యాంటీన్ పునః ప్రారంభోత్సవం లో ఏకంగా ముఖ్యమంత్రితో మాట్లాడే అవకాశం వచ్చింది. తను ఆటో నడుపుతూ తన ఇద్దరు పిల్లలనూ ఉన్నత విద్య చదివిస్తున్నానని ఆయన సీఎంకు వివరించారు. రజినీకాంత్ తో పాటు ఆయన కుమారుడు రవితేజ కూడా సీఎం తో మాట్లాడే అవకాశాన్ని తీసుకున్నాడు. తాను ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ప్రైవేటు ఉద్యోగం చేస్తూ తన చెల్లి బీడీఎస్‌ చదువుకు చేదోడుగా నిలుస్తున్నానని చెప్పారు. రజనీకాంత్ తో పాటు ఆయన కుమారుడి మాటలు అందరితో పాటు ముఖ్యమంత్రి ని కూడా కదిలించాయి.

ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన కొద్ది గంటల్లోనే…

రజనీకాంత్ చెప్పిన విషయం విన్న ముఖ్యమంత్రి ఆయనకు ఓ హామీ ఇచ్చారు. కష్టపడి కొడుకు తో పాటు కుమార్తె ను కూడా ఉన్నత విద్య చదివిస్తూ ఉండడం, ఆడపిల్ల చదువు రజనీకాంత్ కు కష్టం కాకూడదని, విద్యుత్తుతో నడిచే ఆటో సమకూరుస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. దానివల్ల డీజల్ ఆదా అయి ఆదాయం ఎక్కువ అవుతుందని, కొంత కలిసి వస్తుందని ఆయన ఉద్దేశం. ఈ మేరకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన గంటల వ్యవధిలో 3.9 లక్షల రూపాయల విలువైన ఎలక్ట్రిక్ ఆటోను అందించారు. కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశాలతో ఆర్టీవో నిమ్మగడ్డ శ్రీనివాస్ గురువారం ‘అపే ఈసిటీ’ ఆటో తీసుకురాగా గుడివాడ మున్సిపల్ కమిషనర్ జి. బాలసుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్యే రావి వేంకటేశ్వర రావు లు ఇరువురూ వెళ్లి రజనీకాంత్ కు ఆటో అందించారు. ఈ విషయం తెలిసి ఆటో వాళ్ళ తో పాటు అందరూ ముఖ్యమంత్రి చొరవ, హామీ, నిలబెట్టుకున్న తీరు అందరినీ ఆకట్టుకుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..