Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 వాతావరణం ఎలా ఉండబోతుందంటే?

వర్షాల కోసం ఎదురుచూస్తున్న తెలుగురాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ స్వల్ప ఊరటనిచ్చే వార్త చెప్పింది. బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాబట్టి ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయో ఇక్కడ తెలుసుకుందాం.

Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
Ap And Telangana Weather Report

Updated on: Aug 28, 2026 | 2:40 PM

తెలుగురాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. ఉత్తర బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్-బంగ్లాదేశ్ తీరాలపై ఏర్పడి ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ, ఇప్పుడు సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్ళే కొద్దీ నైరుతి దిశగా వంగి ఉంటుంది. దీని ప్రభావంతో, ఆగస్టు 29వ తేదీ 2026 నాటికి వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్-ఉత్తర ఒడిశా తీరాలపై ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో పశ్చిమ, వాయువ్య దిశగా గాలులు వీస్తాయని, వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని.. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఆదివారం వర్షాలతో పాటు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో ఈదురుగాలు వీచే అవకాశముందని తెలిపింది.

దక్షిణకోస్తా ఆంధ్రప్రదేశ్ వర్షాలు

ఈ ప్రాంతాల్లో రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందిని.. అలాగే వర్షాల సమయంలో బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని తెలిపింది. అలాగే రాయల సీమ జిల్లాలో కూడా ఇదే తరహా వాతావరణం ఉండొచ్చని స్పష్టం చేసింది.

తెలంగాణలో వాతావరణం

బంగాళఖాతంలోని ఆవర్తన ప్రభావంతో శుక్ర, శని, ఆదివారాల్లో తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని.. మిగతా జిల్లాల్లో వర్షాలతో పాటు బలమైన ఉపరితల గాలులు గంటలకు 30-40 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us