Municipal Elections: ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల ఏర్పాట్లపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌

|

Feb 22, 2021 | 6:06 PM

Municipal Elections: ఏపీలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఇక మున్సిపల్‌ ఎన్నికలు ఉన్నాయి. తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ అధికారులతో...

Municipal Elections: ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల ఏర్పాట్లపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌
Follow us on

Municipal Elections: ఏపీలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఇక మున్సిపల్‌ ఎన్నికలు ఉన్నాయి. తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మున్సిపల్‌ ఎన్నికలపై తీసుకోవాల్సిన చర్యలపై నిమ్మగడ్డ అధికారులకు దిశానిర్ధేశం చేశారు. పంచాయతీ ఎన్నికలను సమర్ధంగా నిర్వహించాలని అధికారులను నిమ్మగడ్డ అభినందించారు. రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 81.78 శాతం పోలింగ్‌ నమోదైందని అన్నారు. ఇక పురపాలక ఎన్నికల్లో పోలింగ్‌ శాతం మరింత పెంచే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా, ప్రజలంతా స్వచ్చంధంగా ఎన్నికల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల సమయానికి బ్యాలెట్‌ బ్యాక్స్‌లు, ఇతర సామాగ్రి సిద్ధం చేసుకోవాలన్నారు. అలాగే వెబ్‌ క్యాస్టింగ్‌, సీసీ కెమెరాలు, వీడియో గ్రఫీ ద్వారా ఎప్పటికప్పుడు నిఘా పెంచేలా చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం నోటా కూడా బ్యాలెట్‌లో పొందుపరుస్తున్నామని, ఎన్నికల కేంద్రాల్లో ఖచ్చితంగా కోవిడ్‌ నిబంధనలు పాటించేలా చూడాలన్నారు. పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికలు కాబట్టి అధికారులు మరింత దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని నిమ్మగడ్డ రమేష్‌ హెచ్చరించారు.

Also Read: Nimmagadda: 80 శాతం పోలింగ్‌ కావడం సంతోషకరం.. ఏపీ పంచాయతీ ఎన్నికలపై నిమ్మగడ్డ స్పందన..