నిబంధనలు ఉల్లంఘించినట్లయితే రిజిస్ట్రేషన్‌ రద్దు చేస్తాం: ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ సీఈవో

|

Apr 25, 2021 | 10:40 PM

Ap Private Labsఆంధ్రప్రదేశ్‌లో ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులు నిర్వహిస్తున్న ప్రైవేటు ల్యాబ్‌లపై ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ సీఈవో డాక్టర్‌ మల్లిఖార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా నిర్ధారన పరీక్షలకు..

నిబంధనలు ఉల్లంఘించినట్లయితే రిజిస్ట్రేషన్‌ రద్దు చేస్తాం: ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ సీఈవో
Corona Test
Follow us on

Ap Private Labsఆంధ్రప్రదేశ్‌లో ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులు నిర్వహిస్తున్న ప్రైవేటు ల్యాబ్‌లపై ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ సీఈవో డాక్టర్‌ మల్లిఖార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా నిర్ధారన పరీక్షలకు అధిక ఛార్జీలు వసూలు చేస్తే ప్రైవేటు ల్యాబ్‌ల రిజిస్ట్రేషన్‌ రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన విధంగా రూ.499లనే ఛార్జ్‌ చేయాలని ఆయన అన్నారు. కొత్తగా ఐసీఎంఆర్‌-ఎన్‌ఏబీఎల్‌ అనుమతి పొందిన ప్రైవేటు ల్యా్‌బ్‌లు వెంటనే ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ను సంప్రదించాలని, ఎంఎన్‌ఎస్‌ పోర్టల్‌ లాగిన్‌లు పొందాలని ఆయన సూచించారు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేసిన వెంటనే ఎంఎన్‌ఎస్‌ పోర్టల్‌లో ఫలితాలు వివరాలు నమోదు చేయాలని ఆయన తెలిపారు. నిబంధనలు పాటించని ప్రైవేటు ల్యాబ్‌ల రిజిస్ట్రేషన్‌ రద్దు చేయడమే కాకుండా క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అధిక డబ్బులు వసూలు చేసినట్లయితే బాధితులు 1902 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.

ఇవీ చదవండి:

షాకింగ్‌ వ్యాఖ్యలు.. మరో రెండు సంవత్సరాలు అప్రమత్తంగానే ఉండాలి.. కరోనాపై ఐఐఎం అహ్మదాబాద్‌ ప్రొఫెసర్‌

Sabbam Hari: మాజీ ఎంపీ సబ్బం హరి ఆరోగ్య పరిస్థితి విషమం.. వెంటిలేటర్‌పైనే చికిత్స.. అభిమానుల్లో ఆందోళన

Corona Effect: ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు.. బేఖాతర్‌ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక