Andhra Weather: చల్లటి కబురు.. కానీ కూసింత జాగ్రత్త.. ఎందుకంటే..?

దక్షిణ అంతర్గత కర్ణాటకపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, మన్నార్ గల్ఫ్ నుంచి మహారాష్ట్ర వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాబోయే మూడు రోజుల పాటు కోస్తా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులు ఉండే అవకాశముంది.

Andhra Weather: చల్లటి కబురు.. కానీ కూసింత జాగ్రత్త.. ఎందుకంటే..?
Andhra Weather

Updated on: Mar 22, 2026 | 1:46 PM

దక్షిణ అంతర్గత కర్ణాటక మరియు పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం ఇప్పుడు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో విస్తరించింది. శనివారం మన్నార్ గల్ఫ్ నుండి దక్షిణ మధ్య మహారాష్ట్ర వరకు, తమిళనాడు, అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి విస్తరించి కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, యానాంపై దిగువ ట్రోపో ఆవరణములో ఆగ్నేయ/నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు తెలుసుకుందాం…

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:

——————————————

ఆదివారం, సోమవారం, మంగళవారం:-  తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు ౩౦-40 కిలోమీటర్లు గరిష్టముగా 50 కిలోమీటర్లు వేగముతో వీస్తాయి.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ :-

————————–

ఆదివారం, సోమవారం, మంగళవారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్లు గరిష్టముగా 50 కిలోమీటర్లు వేగముతో వీస్తాయి.

రాయలసీమ :-

—————–

ఆదివారం, సోమవారం :- పొడివాతావరణం ఏర్పడే అవకాశముంది .

మంగళవారం ;- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్లు గరిష్టముగా 50 కిలోమీటర్లు వేగముతో వీస్తాయి.

అయితే ఈ వర్షాల సమయంలో పిడుగులు పడే అవకాశం ఉంది. అందుకే రెయిన్ పడుతుంటే చెట్ల కింద నిల్చొవద్దు. ఆ సమయంలో ఎలక్ట్రానిక్ వస్తువులు ఉపయోగించకపోవడం మంచింది. కరెంట్ స్తంభాలకు దూరంగా ఉండండి..

గమనిక :- ఆంధ్రప్రదేశ & యానాం లో రాగల 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 -3 డిగ్రీల సెంటీగ్రేడ్ క్రమంగా పెరిగే అవకాశముంది.

Follow Us