Andhra Pradesh: అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ మావోయిస్టు డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్ధాలతో పాటు.. మొత్తం 21 రకాల వస్తువులు ఈ డంప్‌లో ఉన్నాయి. అల్లూరి జిల్లా సరిహద్దుల్లో మావోయిస్టు అలజడి కొనసాగుతుందన్న సమాచారంలో రంగంలోకి దిగిన పోలీసులు.. పెదబయలు మండలం జక్కం వద్ద గుర్తించిన కుంబింగ్ నిర్వహించారు. ఈ సమయంలో భారీ డంప్‌ను గుర్తించారు పోలీసులు. డంప్మెుత్తం పెదబయలు, కోరుకొండ, గాలికొండకు ప్రాంతాలకు చెందిన మావోయిస్టులదిగా గుర్తించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ముందస్తు సమాచారంతో సీఆర్పీఎఫ్ దళాల సహాయంతో డంపు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా డితోనేటర్లు, వైర్లెస్ సెట్లు, ఆధునాతన స్కానర్, గన్‌పౌడర్ వంటి భారీ మావోయిస్ట్ డంప్ స్వాధీనం చేసుకున్నారు.
అయితే జూన్‌లో పోలీసులు ఒక 9-మిమీ సెమీ ఆటోమేటిక్ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఒక ల్యాండ్‌మైన్, 39 లక్షల నగదు, ఐదు డిటోనేటర్లు, ఆరు బ్యాటరీలును కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అలాగే పెదబయలు-కోరుకొండ ఏరియా కమిటీ కార్యదర్శి వంతల రామకృష్ణ అలియాస్ ప్రభాకర్ అలియాస్ అశోక్‌ను అరెస్టు చేశారు. దీంతో అదే రోజు 33 మంది మావోయిస్టులు, 27 మంది మిలీషియా సభ్యులు కూడా లొంగిపోయారు. డంప్ రికవరీ మావోయిస్టులకు పెద్ద దెబ్బ అన్నారు ఎస్పీ సతీష్. రెండు నెలల్లో ఇది రెండో రికవరీ అని తెలిపారు. అటు ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టుల కదలిక అంతంత మాత్రంగానే ఉందని, దాదాపు అగ్రనేతలందరూ ఛత్తీస్‌గఢ్‌లోని సురక్షిత ప్రాంతాలకు పారిపోయారని చెబుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌కు పారిపోయే ముందు ఈ డంప్‌ను కొందరు సీనియర్ నేతలు తమ వద్ద ఉంచుకున్నట్లు తెలుస్తోంది.దీంతో మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..