AP MPTC And ZPTC Elections 2021: భవితవ్యం తేలేది రేపే.. ముగిసిన ఏపీ పరిషత్ ఎన్నికల పోలింగ్..

| Edited By: Shaik Madar Saheb

Nov 16, 2021 | 7:20 PM

ఏపీలో పరిషత్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 10 జెడ్పీటీసీ స్థానాలు సహా..123 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు.

AP MPTC And ZPTC Elections 2021: భవితవ్యం తేలేది రేపే.. ముగిసిన ఏపీ పరిషత్ ఎన్నికల పోలింగ్..
Ap Mptc And Zptc Elections
Follow us on

ఏపీలో పరిషత్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 10 జెడ్పీటీసీ స్థానాలు సహా..123 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఎల్లుండి ఓట్ల లెక్కింపు ఉంటుంది. వాస్తవానికి పరిషత్ ఎన్నికలు నెల కిందటే జరిగాయి. కానీ అప్పుడు వివిధ కారణాలతో ఆగిపోయిన, గెలిచినవారు చనిపోయిన స్థానాల్లో ఇప్పుడు ఎన్నికలు నిర్వహించారు. ఇవి కాకుండా గతంలో ఓట్ల లెక్కింపు సమయంలో తడిసిన ఓట్ల కారణంగా లెక్కింపు ఆగిపోయిన కడప జిల్లా జమ్మలమడుగు జెడ్పీటీసీ స్థానంలో రెండు బూత్‌లతోపాటు మరో ఆరు ఎంపీటీసీ స్థానాల్లోనూ రీ పోల్‌ నిర్వహించారు.

మొత్తం 14 జెడ్పీటీసీ స్థానాలు, 176 ఎంపీటీసీ స్థానాల నోటిఫికేషన్‌ జారీ చేశారు. వీటిలో నాలుగు ZPTC స్థానాలు, 50 ఎంపీటీసీ స్థానాల ఎన్నిక ఏకగ్రీవం అయ్యాయి. మూడు MPTC స్థానాల్లో ఎవరూ నామినేషన్ల దాఖలు చేయకపోవడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. 954 పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ నిర్వహించారు..జెడ్పీటీసీ స్థానాల్లో 40 మంది, ఎంపీటీసీ స్థానాల్లో 328 మంది పోటీ చేశారు.

ఇవి కూడా చదవండి: CM KCR: రైతు దీక్షకు సీఎం కేసీఆర్‌..? కేంద్రంతో అమీతుమీకి సిద్ధమైన గులాబీ దళం..

Onion Face Pack: ఉల్లిపాయ ఫేస్‌ప్యాక్.. ఇలా చేస్తే తళుక్కుమనే అందం మీ సొంతం..