Kondapalli Election: కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ఉత్కంఠకు తెర.. ఎస్ఈసీకి ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు!

|

Nov 23, 2021 | 4:36 PM

కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికకు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌కు సంబంధించిన ఎన్నికలను బుధవారం నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది.

Kondapalli Election: కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ఉత్కంఠకు తెర.. ఎస్ఈసీకి ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు!
Ap High Court
Follow us on

AP High Court on Kondapalli Chairman Election: కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికకు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌కు సంబంధించిన ఎన్నికలను బుధవారం నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డింగ్‌ చేయాలని కోర్టు సూచించింది. కొండపల్లి మున్సిపల్ ఎన్నికపై లంచ్ మోషన్ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు సీరియస్ అయింది. మధ్నాహ్నం 2:15 గంటలకు విజయవాడ పోలీసు కమీషనర్.. కొండపల్లి మున్సిపల్‌ కమిషనర్‌ హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.

అయితే, తాము ఆదేశించినప్పటికీ కొండపల్లి ఎన్నిక ఎందుకు నిర్వహించలేకపోయారని హైకోర్టు ప్రశ్నించింది. బుధవారం ఉదయం ఎన్నిక నిర్వహించి తీరాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. అలాగే, ఎన్నికైన అభ్యర్థులకు పూర్తిస్థాయి రక్షణ కల్పించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని విజయవాడ పోలీసు కమీషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. అలాగే పార్లమెంటు సభ్యులు కేశినేని నాని తన ఓటుహక్కు వినియోగించుకోవచ్చన్న కోర్టు స్పష్టం చేసింది. నాని ఓటు హక్కు కోర్టు తుది తీర్పుకు లోబడి ఉంటుందని తెలిపింది. అప్పటి వరకు ఫలితాలను ప్రకటించకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. కాగా, హైకోర్టు ప్రతి సభ్యుడికి ప్రత్యేకంగా.. భద్రత ఏర్పాటు చేయాలని పోలీసు శాఖను ఆదేశించింది.

Read Also… AP Council Bill: ఏపీ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. శాసన మండలి రద్దు నిర్ణయం వెనక్కి.. ఆమోదించిన అసెంబ్లీ