Andhra Pradesh: ఆనం రామనారాయణ రెడ్డిపై సీఎం జగన్ సీరియస్.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్..!

|

Jan 03, 2023 | 6:42 PM

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ విధానాలపై వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామరామనారాయణ రెడ్డి చేసిన కామెంట్స్‌పై వైసీపీ అధినేత, సీఎం జగన్ సీరియస్‌ అయ్యారు.

Andhra Pradesh: ఆనం రామనారాయణ రెడ్డిపై సీఎం జగన్ సీరియస్.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్..!
AP CM Ys Jagan
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ విధానాలపై వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామరామనారాయణ రెడ్డి చేసిన కామెంట్స్‌పై వైసీపీ అధినేత, సీఎం జగన్ సీరియస్‌ అయ్యారు. వరుసగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తుండటంపై గుర్రుగా ఉన్న అధినేత.. వెంకటగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ఆయను తొలగించి, వేరే వారిని నియమించే యోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తిరుపతి జిల్లా అధ్యక్షుడు, మాజీ సీఎం నేదురుమల్లి కుమారుడు రామ్ కుమార్ రెడ్డిని నియమించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. దాంతో నెదురుమల్లి అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు.

ఆనం రామనారాయణ రెడ్డి కామెంట్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి అనిల్. ఏడాదిలోపు ముందస్తు ఎన్నికలు వస్తాయని ఆనం రామనారాయణ రెడ్డి జ్యోతిష్యం చెప్పించుకున్నాడేమో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సీఎం చెప్పిన ప్రకారం 2024లోనే ఎన్నికలు వస్తాయని, ముందస్తుపై ఆనం కలగన్నాడేమో అంటూ సెటైర్లు వేశారు. ఆనం రామనారాయణ రెడ్డి ప్రస్తుతం చేసిన వ్యాఖ్యల గురించి ఏడాది క్రితమే తాను చెప్పానని గుర్తు చేశారు మాజీ మంత్రి. 2024 ఎన్నికల్లో వైసీపీ గెలవటం ఖాయం అని, టీడీపీ పార్టీ శాశ్వతంగా మూత పడటం ఖాయం అన్నారు.

ఇదిలాఉంటే.. ఆనం వ్యాఖ్యలపై మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్రంగా తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వంపై ఆనం చేసిన విమర్శలను ఖండించారు. ఆనం వ్యాఖ్యలు దురదృష్టకరం అన్నారు. ఓట్ల కోసం పెన్షన్లు ఇవ్వడం లేదని, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచే సంక్షేమం కోసం పని చేస్తున్నామని చెప్పారు మంత్రి కాకాని. వర్షాలు పడితే రోడ్లు దెబ్బతినడం సాధారణమేనని, రోడ్ల మరమ్మతులు చేస్తూనే ఉన్నామన్నారు. రోడ్ల మరమ్మతుల కోసం గత ప్రభుత్వ హయాంలో ఎంత ఖర్చు చేశారు? వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంత ఖర్చు చేశారో చర్చకు సిద్ధం అని మంత్రి కాకాని సవాల్ విసిరారు. ఎవరో విమర్శిస్తే ప్రభుత్వాలు మారిపోవంటూ ఆనం వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

వెంకటగిరిలో సంబరాలు..

అయితే, కొన్నాళ్లుగా వెంకటగిరి నియోజకవర్గంలో రామ్‌కుమార్ వర్గానికి, ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి వర్గానికి మధ్య పొరపచ్చాలు కనిపిస్తున్నాయి. ఆనం ఏ వేదిక ఎక్కినా.. ప్రభుత్వంపై విమర్శలు, రామ్‌నారాయణ తీరుపై ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ‘పెన్షన్లు ఇస్తే చాలు ఓట్లు పడతాయా? రోడ్లు కూడా సరిగా వెయ్యలేకపోతే మనం ఎందుకు? సచివాలయాల నిర్మాణం ఎందుకు పూర్తి కాలేదు. టీడీపీని తిట్టిపోసిన మనం మాత్రం సాధించింది ఏంటీ? ఈ పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలకు వెళితే ఏడాదిలోపే ఇంటికెళ్ళడం ఖాయం. పెన్షన్లతో ఓట్లు రాలవు.’ అంటూ ఆనం రామనారాయణ రెడ్డి తాజాగా సంచలన కామెంట్స్ చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..