CM Jagan: వారికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం.. దిశ వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్

|

Mar 23, 2022 | 12:43 PM

మహిళలకు అన్యాయం జరిగితే వైసీపీ ప్రభుత్వం ఊరుకోదని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి (CM Jagan) అన్నారు. మహిళలు, చిన్నారుల భద్రతకు (Women Safety) తమ ప్రభుత్వం...

CM Jagan: వారికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం.. దిశ వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్
Cm Jagan On Disha
Follow us on

మహిళలకు అన్యాయం జరిగితే వైసీపీ ప్రభుత్వం ఊరుకోదని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి (CM Jagan) అన్నారు. మహిళలు, చిన్నారుల భద్రతకు (Women Safety) తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని వెల్లడించారు. వారికి మరింత రక్షణ ఇచ్చేందుకు మరో 163 దిశ పెట్రోలింగ్‌ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. సచివాలయం మొదటి బ్లాక్ నుంచి ముఖ్యమంత్రి లాంఛనంగా ఈ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుడుతున్నామన్న సీఎం.. 1.16 కోట్ల మంది దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నారన్నారు. దిశా యాప్ ద్వారా మహిళలకు వేగంగా రక్షణ కల్పించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. 163 దిశా పోలీస్ వాహనాలతో పాటు.. బందోబస్తు సమయాల్లో మహిళా పోలీసులకు సౌకర్యవంతంగా ఉండేలా 18 కారా వ్యాన్‌లను విజయవాడలో సీఎం జగన్‌ ప్రారంభించారు. దిశా యాప్‌ ద్వారా ఫిర్యాదు అందిన 10 నిమిషాల్లోపే సహాయం అందేలా ప్రయత్నం చేస్తున్నామనని సీఎం వెల్లడించారు.

ఈ దిశ పెట్రోలింగ్‌ వాహనాలు జీపీఎస్‌ ద్వారా కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానమై ఉంటాయి. ఇప్పటికే దిశ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో 900 ద్విచక్ర వాహనాలు అందుబాటులో ఉంచారు. దిశ పెట్రోలింగ్‌ వాహనాలకు రూ. 13.85 కోట్లు, రెస్ట్‌ రూమ్స్‌కి రూ. 5.5 కోట్లు ఖర్చు చేశారు. మహిళా సిబ్బందికి ప్రత్యేకంగా విశ్రాంతి గదులు ఏర్పాటు చేశారు. ఏదైనా ప్రమాదం జరిగితే పట్టణాల్లో 4-5 నిమిషాల్లో, గ్రామాల్లో 8-10 నిమిషాల్లో దిశ సిబ్బంది స్పందిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళలు, చిన్నారులకు రక్షణ కల్పించడం, మహిళలకు పటిష్టమైన భద్రత, క్షేత్ర స్థాయిలో నేరాలను అరికట్టడం, ప్రజలకు మరింత చేరువ కావడం, విజిబుల్‌ పోలీసింగ్‌ను మెరుగుపరచడం కోసం రాష్ట్ర పోలీస్‌ శాఖ దిశ పెట్రోలింగ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ఇవీచదవండి

NASA: సౌర వ్యవస్థ వెలుపల 5000 గ్రహాలలో జీవం ఆనవాళ్లు.. అచ్చం భూమిలా ఎన్నున్నాయో తెలుసా?

Novavax: నొవావ్యాక్స్ అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి.. ఆ వయస్సు వారికి అందుబాటులోకి టీకా

Religious harmony: మత సామరస్యాన్ని చాటుకున్న ముస్లిం కుటుంబం.. విరాట్ రామాలయ నిర్మాణానికి రూ.2.5 కోట్ల స్థలం విరాళం