YSR Pension Kanuka: లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్న జగన్‌ సర్కార్‌

|

Sep 30, 2022 | 9:53 PM

ప్రతి నెలా ఒకటో తేదీన సూర్యోదయానికి ముందే వయోవృద్దులకు, ఒంటరి మహిళలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులున్న వారికి ఇంటింటికి పెన్షన్‌లను అందిస్తోంది ఏపీ ప్రభుత్వం..

YSR Pension Kanuka: లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్న జగన్‌ సర్కార్‌
Ysr Pension Kanuka
Follow us on

ప్రతి నెలా ఒకటో తేదీన సూర్యోదయానికి ముందే వయోవృద్దులకు, ఒంటరి మహిళలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులున్న వారికి ఇంటింటికి పెన్షన్‌లను అందిస్తోంది ఏపీ ప్రభుత్వం. లక్షలాది మందికి వారి ఇంటికే వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపి, వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది జగన్‌ ప్రభుత్వం. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి నెలా 5వ తేదీలోగానే దాదాపుగా పింఛన్ల పంపిణీ పూర్తి చేస్తోంది. అవ్వా తాతలు, ఒంటరి మహిళలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు.. వీళ్లు ఎవ్వరూ ఇంటి గడప దాటకుండానే పింఛన్లు అందుకుంటున్నారు. సెప్టెంబర్ నెలకు గానూ 62.53 లక్షల మందికి రూ.1,590.50 కోట్లు పంపిణీ చేస్తోంది ప్రభుత్వం. గత ఏడేళ్లలో ప్రతి సెప్టెంబర్ నెలలోనూ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి ఖర్చు చేసిన మొత్తం వివరాలివి.

ఇలా ఏపీ రాష్ట్రంలో వయోవృద్ధులకు, అర్హులైన ఇతరులకు వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక కింద నెలవారీ పెన్షన్‌ అందిస్తోంది ప్రభుత్వం. ప్రతి నెల ప్రారంభంలోనే గ్రామ వలంటీర్లు స్వయంగా లబ్దిదారుల ఇంటింటికి వెళ్లి పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు. సెప్టెంబర్‌ నెలకు సంబంధించిన పెన్షన్‌లను అక్టోబర్‌ 1వ తేదీ నుంచి పంపిణీ చేయనున్నారు. అయితే గత ప్రభుత్వం మధ్యలో పెన్షన్‌లను తగ్గించేందుకు ప్రయత్నం చేస్తే వైఎస్సార్‌ సర్కార్‌ అధికారంలోకి రాగానే అర్హులైన వారందరికీ పెన్షన్‌లను మంజూరు చేసింది. అర్హులైన వారు పెన్షన్‌ కొరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తులు చేసుకున్న లబ్దిదారుల జాబితాను తయారు చేసి అర్హులైర వారందరికీ పెన్షన్‌ అందిస్తోంది ప్రభుత్వం. అయితే ప్రతి నెల 1వ తేదీన అందిస్తున్న పెన్షన్లు ఒక పెద్దకొడుకు కంటే ఎక్కువ బాధ్యత తీసుకుంటున్న సీఎం జగన్‌మోహన్ రెడ్డికి ఈ జన్మంతా రుణపడి ఉంటామని లబ్ధిదారులు అంటున్నారు. కాగా, 2015 నుంచి 2022 వరకు ఎంతెంత పెన్షన్‌ పంపిణీ చేసిందే ప్రభుత్వం వెల్లడించింది.

☛ సెప్టెంబర్ 2022లో రూ.1,590.50 కోట్లు

ఇవి కూడా చదవండి

☛ సెప్టెంబర్ 2021లో రూ.1,397 కోట్లు

☛ సెప్టెంబర్ 2020లో రూ.1,429 కోట్లు

☛ సెప్టెంబర్ 2019లో రూ.1,235 కోట్లు

☛ సెప్టెంబర్ 2018లో రూ. 477 కోట్లు

☛ సెప్టెంబర్ 2017లో రూ.418 కోట్లు

☛ సెప్టెంబర్ 2016లో రూ.396 కోట్లు

☛ సెప్టెంబర్ 2015లో రూ.405 కోట్ల పెన్షన్‌లను పంపిణీ చేసింది ప్రభుత్వం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి