వివేకా హత్య కేసు.. రేపు సిట్‌ ముందుకు వైఎస్ అవినాష్

మాజీ మంత్రి, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును సిట్ బృందం వేగవంతం చేసింది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని ప్రశ్నిస్తోన్న సిట్ బృందం తాజాగా వైఎస్ కుటుంబసభ్యుడు, వైసీపీ కడప ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో శనివారం అవినాష్, సిట్ అధికారుల ముందు హాజరవ్వనున్నారు. ఈ కేసులో అవినాష్ రెడ్డి ప్రధాన సాక్షి కాగా.. ఆయన చెప్పే సాక్ష్యం కూడా కీలకంగా […]

వివేకా హత్య కేసు.. రేపు సిట్‌ ముందుకు వైఎస్ అవినాష్
Follow us

| Edited By:

Updated on: Dec 07, 2019 | 6:44 PM

మాజీ మంత్రి, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును సిట్ బృందం వేగవంతం చేసింది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని ప్రశ్నిస్తోన్న సిట్ బృందం తాజాగా వైఎస్ కుటుంబసభ్యుడు, వైసీపీ కడప ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో శనివారం అవినాష్, సిట్ అధికారుల ముందు హాజరవ్వనున్నారు. ఈ కేసులో అవినాష్ రెడ్డి ప్రధాన సాక్షి కాగా.. ఆయన చెప్పే సాక్ష్యం కూడా కీలకంగా మారనుంది.

కాగా మార్చి 15న వైఎస్ వివేకా దారుణ హత్యకు గురయ్యారు. ఆయన గుండెపోటుతో మరణించారని ముందు భావించినా.. ఆ తరువాత పోస్ట్‌మార్టమ్‌లో హత్యగా తేలింది. దీంతో ఈ హత్య కేసు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది. అందునా సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందే వైఎస్ దారుణ హత్యకు గురవ్వడంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దీనిపై దర్యాప్తుకు ఓ సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. అయితే వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ బృందాన్ని మార్చేసి కొత్త సిట్‌ను ఏర్పాటు చేశారు. కానీ దర్యాప్తు విషయంలో మొదట్లో  ఈ బృందం కాస్త నిదానించినా.. ఆ తరువాత వేగాన్ని పెంచింది. ఈ క్రమంలో అనుమానితులతో పాటు వైఎస్ కుటుంబసభ్యులను, పలువురు టీడీపీ, వైసీపీ నేతలను సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ కుటుంబసభ్యులైన వైఎస్ భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డిలను సిట్ బృందం విచారించిన విషయం తెలిసిందే. వారితో పాటు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని పోలీసులు విచారించారు. ఇక మాజీ మంత్రి ఆది నారాయణ రెడ్డికి కూడా ఈ కేసులో నోటీసులు జారీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.