Breaking: కుప్పం వైసీపీ ఇంచార్జి, బాబుపై పోటీ చేసిన చంద్రమౌళి కన్నుమూత

| Edited By:

Apr 17, 2020 | 10:29 PM

వైసీపీ పార్టీ కుప్పం నియోజకవర్గ ఇంచార్జి, రిటైర్డ్ ఐఏఎస్ డా.చంద్రమౌళి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లో చనిపోయారు.

Breaking: కుప్పం వైసీపీ ఇంచార్జి, బాబుపై పోటీ చేసిన చంద్రమౌళి కన్నుమూత
Follow us on

వైసీపీ పార్టీ కుప్పం నియోజకవర్గ ఇంచార్జి, రిటైర్డ్ ఐఏఎస్ డా.చంద్రమౌళి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లో చనిపోయారు. ఐఏఎస్ అధికారిగా పనిచేసిన చంద్రమౌళి, రిటైర్డ్ అయిన తరువాత రాజకీయాల్లోకి వచ్చారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో చంద్రబాబుపై పోటీ చేసిన ఆయన పరాజయం పాలయ్యారు. విషయం తెలుసుకున్న సీఎం జగన్.. ఫోన్లో చంద్రమౌళి కుటుంబసభ్యులను పరామర్శించారు. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో చంద్రమౌళి పార్థివ దేహానికి నివాళులు అర్పించేందుకు జగన్ హాజరుకాలేకపోతున్నారని సమాచారం. కాగా ఆయన మృతిపై మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. సోదర సమానులు చంద్రమౌళి గారు అనారోగ్యంతో మనకు భౌతికంగా దూరం కావడం  వైఎస్సార్సీపీ కుటుంబానికి తీరని లోటు.. ఆ భగవంతుడు ఆయన ఆత్మకి శాంతి చేకూర్చలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని నాని తన సోషల్ మీడియాలో నివాళులు అర్పించారు.

Read This Story Also: కరోనా వైరస్ గురించి కేరళ వైద్యుల షాకింగ్ నిజం..!