Breaking: కరోనా వైరస్ గురించి కేరళ వైద్యుల షాకింగ్ నిజం..!

కరోనా ల‌క్ష‌ణాలు ఉన్న‌వారికి 14 రోజుల క్వారంటైన్ పీరియ‌డ్ సరిపోదని కేర‌ళ  వైద్య నిపుణులు చెబుతున్నారు. దేశంలో మొట్టమొదటి కరోనా కేసు ఆ రాష్ట్రంలోనే  బ‌య‌ట‌డిన విషయం తెలిసిందే.

Breaking: కరోనా వైరస్ గురించి కేరళ వైద్యుల షాకింగ్ నిజం..!
Follow us

| Edited By:

Updated on: Apr 17, 2020 | 10:07 PM

కరోనా ల‌క్ష‌ణాలు ఉన్న‌వారికి 14 రోజుల క్వారంటైన్ పీరియ‌డ్ సరిపోదని కేర‌ళ  వైద్య నిపుణులు చెబుతున్నారు. దేశంలో మొట్టమొదటి కరోనా కేసు ఆ రాష్ట్రంలోనే  బ‌య‌ట‌డిన విషయం తెలిసిందే. ఆ కేసులను పరిశీలించిన డాక్టర్లు.. కరోనా లక్షణాలు ఉన్న వారికి 14 రోజుల క్వారంటైన్ సరిపోదని తేల్చారు. సాధార‌ణంగా శ‌రీరంలో కరోనా వైర‌స్ ఉంటే 14 రోజుల్లో దాని ప్ర‌భావం తెలుస్తుంది. కానీ కొంద‌రిలో  26-28 రోజుల త‌రువాత గానీ వైర‌స్ లక్ష‌ణాలు క‌నిపించ‌డం లేదని అక్కడి వైద్యులు వెల్లడించారు. “విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారికి జరిపిన కరోనా పరీక్షల్లో .. కొంద‌రికి  ఎలాంటి వైర‌స్ ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ‌లేదు. అయిన‌ప్ప‌టికీ  28 రోజుల‌పాటు క్వారంటైన్ పీరియ‌డ్‌ను అనుస‌రించాం. ఆ త‌ర్వాత వారిలో 17 మందికి పాజిటివ్ అని తేలింది. కొన్ని ప్రాంతాల్లో వైర‌స్ మ‌ళ్లీ వస్తోన్న కేసుల‌ను కూడా మ‌నం చూస్తున్నాం. ఇలాంటి ప‌రిస్థితుల్లో రిస్క్ చేయ‌క‌పోవ‌డ‌మే మంచిది” అని కేర‌ళ మెడిక‌ల్ ఆఫీస‌ర్ నారాయ‌ణ నాయ‌క్ వెల్లడించారు.

వారి అధ్యయనం ప్ర‌కారం దాదాపు 95 శాతం మంది క‌రోనా బాధితుల్లో 14రోజుల్లోనే ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డగా.. 5 శాతం మందిలో  చాలా ఆల‌స్యంగా బ‌య‌ట‌ప‌డుతున్నాయట. అయితే ఈ ఐదు శాతం మంది సాధార‌ణంగా క‌నిపిస్తూ, అంద‌రిలో క‌లిసి తిర‌గ‌డం వ‌లన చాలామందికి కరోనా సోకే ఆస్కారం ఉందని వారు తెలిపారు. కాబ‌ట్టి ల‌క్ష‌ణాలు లేనంత మాత్రాన క‌రోనా రాద‌ని చెప్ప‌లేమని.. వైర‌స్ క‌ణాలు 14 నుంచి నెల రోజుల్లోపు బ‌య‌ట‌ప‌డుతున్నాయని వివరించారు. అందుకే కేర‌ళ‌లో 28 రోజుల‌పాటు క్వారంటైన్ చేస్తున్నట్లు నారాయణ నాయక్ తెలిపారు.

Read This Story Also: ర్యాపిడ్ కిట్లతో కరోనా పరీక్ష చేయించుకున్న సీఎం జగన్..!

Latest Articles