ఏపీ రాజధాని విషయంలో శివరామకృష్ణ కమిటి ఏం చెప్పింది..?

| Edited By:

Jan 01, 2020 | 6:17 AM

ఏపీ రాజధానుల అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండబోతున్నాయని సీఎం జగన్ తేల్చి చెప్పడంతో.. అమరావతి రాజధాని రైతులు ఆందోళనకు దిగారు. అయితే అసలు ఏపీ రాజధాని ఎంపికపై తొలుత చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే శివరామకష్ణ కమిటీ వేసింది. అయితే అప్పుడు ఆ కమిటీ సిఫారసులను పరిగణలోకి తీసుకోకుండా.. అమరావతిని రాజధానిగా ప్రకటించి శంకుస్థాపన చేశారు. అయితే ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చాక.. మూడు రాజధానుల ప్రకటనతో ఏపీ రాజధాని […]

ఏపీ రాజధాని విషయంలో శివరామకృష్ణ కమిటి ఏం చెప్పింది..?
Follow us on

ఏపీ రాజధానుల అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండబోతున్నాయని సీఎం జగన్ తేల్చి చెప్పడంతో.. అమరావతి రాజధాని రైతులు ఆందోళనకు దిగారు. అయితే అసలు ఏపీ రాజధాని ఎంపికపై తొలుత చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే శివరామకష్ణ కమిటీ వేసింది. అయితే అప్పుడు ఆ కమిటీ సిఫారసులను పరిగణలోకి తీసుకోకుండా.. అమరావతిని రాజధానిగా ప్రకటించి శంకుస్థాపన చేశారు. అయితే ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చాక.. మూడు రాజధానుల ప్రకటనతో ఏపీ రాజధాని అంశం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో మళ్లీ శివరామ కృష్ణ కమిటీ నివేదిక హాట్ టాపిక్‌గా మారింది.

అసలు ఈ కమిటీ ఏం చెప్పింది..?

* ఏపీలో ఏకైక అతిపెద్ద రాజధాని ఏర్పాటు సరైంది కాదని తెల్చేంది.
* రాష్ట్రంలో రాజధానిని వికేంద్రీకరించాలి.
* అధికార వ్యవస్థలను వికేంద్రీకరించాలి.
* ప్రభుత్వ వ్యవస్థలను ఒకే చోట కాకుండా.. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి.
* విజయవాడ- గుంటూరు, విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర, శ్రీకాళహస్తి- నడికుడి, రాయలసీమ ప్రాంతాల మధ్య ప్రభుత్వాధికార వ్యవస్థలను వికేంద్రీకరించాలి.
* అసెంబ్లీ, సెక్రటరియేట్ ఎక్కడ ఉంటాయో.. అక్కడే హై కోర్ట్ ఉండాలని లేదు
* హైకోర్టును ఒక ప్రాంతంలో ఏర్పాటు చేస్తే.. మరో ప్రాంతంలో హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయొచ్చు.
* ఉత్తరాంధ్ర, రాయలసీమలలో ప్రభుత్వాధికార వ్యవస్థల్ని విస్తరించాలి.
* రాజధానిని రెండు పట్టణాల మధ్యే పూర్తిగా కేంద్రికరిస్తే.. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల అభివృద్ధి అవకాశాలు దెబ్బతింటాయి. ముఖ్యంగా ( గుంటూరు – విజయవాడ మధ్య)
* సార వంతమైన పంట పొలాల్ని వీలైనంత తక్కువ నష్టం జరిగేలా రాజధాని ఏర్పాటు చేయాలి
* విజయవాడ – గుంటూరు మధ్య భూగర్భ జలమట్టం చాలా పైకి ఉంటుంది.
* విజయవాడ – గుంటూరు ప్రాంతం భూకంప క్షేత్రం.. ఇక్కడ భారీ భవనాల నిర్మాణం సరైంది కాదు.
* అన్ని జిల్లాల ప్రధాన నగరాల్లో సమగ్రాభివృద్ధికి ప్రత్యేకమైన విధి విధానాలను రూపొందించాలి.