Weather Report: తిరోగమిస్తున్న నైరుతి రుతుపవనాలు.. ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు..

|

Oct 21, 2021 | 2:17 PM

దేశంలోని పలు ప్రాంతాల్లోంచి నైరుతి రుతుపనాలు తిరోగమిస్తున్నాయి. ఉపసంహరణ తిరోగమన రేఖ కోహిమా, సిల్చార్, కృష్ణానగర్, బారిపాడ, మల్కన్‎గిరి, నల్గొండ, బాగల్కోట్, వెంగూర్ల ప్రాంతాల గుండా కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రము తెలిపింది...

Weather Report: తిరోగమిస్తున్న నైరుతి రుతుపవనాలు.. ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు..
Follow us on

దేశంలోని పలు ప్రాంతాల్లోంచి నైరుతి రుతుపనాలు తిరోగమిస్తున్నాయి. ఉపసంహరణ తిరోగమన రేఖ కోహిమా, సిల్చార్, కృష్ణానగర్, బారిపాడ, మల్కన్‎గిరి, నల్గొండ, బాగల్కోట్, వెంగూర్ల ప్రాంతాల గుండా కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రము తెలిపింది. అక్టోబర్ 23 న ఈశాన్య భారతదేశ లోని మిగిలిన భాగాలు, ఉత్తర బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్‎లో మిగిలిన ప్రాంతాలు, మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, గోవా నుంచి రుతుపవనాలు తిరోగమిస్తాయని వెల్లడించింది. మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు తిరోగమించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది.

సుమారుగా అక్టోబర్ 26న బంగాళాఖాతం, దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలో ఈశాన్య గాలులు వీచే అవకాశం ఉన్నందువలన నైరుతి రుతుపవనాలు మొత్తం దేశం నుండి తిరోగమించుకునే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. అదే సమయంలో ఈశాన్య రుతుపవనాలు భారతదేశంలోని ఆగ్నేయ ద్వీపకల్పంలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్‎లోని ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాంలో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులుతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

దక్షిణ కోస్తాఆంధ్రాలో ఈరోజు, రేపు, ఎల్లుండి, ఉరుములు, మెరుపులుతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని తెలపింది. రాయలసీమలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
‌ ‌

Read Also..  Sajjala: టీడీపీ లైన్‌ దాటింది.. ఏమైనా జరిగితే చంద్రబాబుదే బాధ్యత: సజ్జల రామకృష్ణారెడ్డి