జగనన్న విద్యా కానుక మరోసారి వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే.!

|

Oct 04, 2020 | 2:33 PM

జగనన్న విద్యా కానుక పధకాన్ని మరోసారి వాయిదా వేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. వాస్తవానికి ఈ పధకాన్ని అక్టోబర్ 5న ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

జగనన్న విద్యా కానుక మరోసారి వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే.!
Follow us on

Jagananna Vidya Kanuka Scheme: జగనన్న విద్యా కానుక పధకాన్ని మరోసారి వాయిదా వేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. వాస్తవానికి ఈ పధకాన్ని అక్టోబర్ 5న ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ ఈ పధకాన్ని ఆ రోజున ఏదైనా స్కూల్‌కు వెళ్లి ప్రారంభించేలా ప్రణాళికలు సిద్దం చేసింది.  (ఏపీ: పాఠశాలలో పరేషాన్.. 20 మంది విద్యార్థులకు కరోనా..)

అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ పధకాన్ని మరోసారి వాయిదా వేస్తున్నామని.. మళ్లీ ఎప్పుడు ప్రారంభిస్తామన్న దానిపై త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని జగన్ సర్కార్ ప్రకటించింది. కాగా, విద్యా కానుక కింద విద్యార్థులకు కిట్ అందించనుండగా.. అందులో పుస్తకాలు, బ్యాగ్, షూస్, సాక్స్, స్కూల్ డ్రెస్ మొదలగునవి ఉండనున్నాయి. (ఏపీ: ఆ ఒక్క జిల్లాలోనే లక్షకు చేరువైన కేసులు..)