రానున్న 24 గంటల్లో ఏపీలో భారీ వర్షాలు..

| Edited By:

Jul 02, 2020 | 2:05 PM

గత కొద్ది రోజుల నుంచి ఏపీలో అక్కడక్కడ వర్షాలు పడుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో రాగల 24 గంటల్లో అనేకచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని..

రానున్న 24 గంటల్లో ఏపీలో భారీ వర్షాలు..
Follow us on

గత కొద్ది రోజుల నుంచి ఏపీలో అక్కడక్కడ వర్షాలు పడుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో రాగల 24 గంటల్లో అనేకచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. గురు, శుక్ర వారాల్లో ఉత్తరాంధ్రలో చాలా చోట్ల మోస్తారు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. కాగా అరేబియా సముద్రంలోని ఉపరితల ఆవర్తనం పడమర తీరంలో ద్రోణి ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా మారాయి. దీంతో కోస్తా ప్రాంతంలో కూడా అనేక చోట్ల బుధవారం భారీ వర్షాలు కురిశాయి. మామిడి వలస, కోటనందూరు, జియ్యమ్మవలస, ఏలేశ్వరంలలో 70 మిల్లీ మీటర్లు, వడ్డాది, బుచ్చయ్యపేటలో 52, రంగాపురం, పాచిపెంట, సీతానగరంలలో 50 మిల్లీ మీటర్లు, చాట్రాయిలో 57, కామవరపు కోటలో 53, సీతానగరంలో 50, దేవరాపల్లిలో 45 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయినట్లు అధికారులు వెల్లడించారు.

Read More:

27 అడుగులకే ఖైరతాబాద్ గణేషుడు.. ఈసారి మట్టితో..

విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఫ్రీగా లాప్‌టాప్స్, ఫోన్స్..