Andhra Pradesh: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

| Edited By: Pardhasaradhi Peri

Mar 09, 2020 | 8:19 PM

ఏపీలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ వివరాలను రాష్ట్ర ఎన్నికల అధికారి రమేష్ కుమార్ వెల్లడించారు.

Andhra Pradesh: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
Follow us on

ఏపీలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ వివరాలను రాష్ట్ర ఎన్నికల అధికారి రమేష్ కుమార్ వెల్లడించారు. ప్రతి జిల్లాకు ఎన్నికల పరిశీలకుడిని నియమించినట్లు రమేష్ కుమార్ వెల్లడించారు. ప్రతి అభ్యర్థి రోజువారీ ఖర్చులు చూపాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఈ క్రమంలో నెల 11 నుంచి 13 వరకు నామినేషన్లు స్వీకరించనుండగా.. 14న నామినేషన్ పత్రాల పరిశీలన, 16న ఉపసంహరణ ఉండనుంది. అదే రోజున మధ్యాహ్నం 3 గంటల తరువాత పోటీలో నిలిచే అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. అలాగే మార్చి 23న పోలింగ్ జరగనుండగా, 27న ఫలితాలు వెలువడనున్నాయి.

అయితే రాష్ట్రంలో ఉన్న మొత్తం 15 మున్సిపల్‌ కార్పొరేషన్లలో..12 కార్పొరేషన్లకు మాత్రం ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు రమేష్ కుమార్ తెలిపారు. కోర్టు కేసుల కారణంగా శ్రీకాకుళం, నెల్లూరు, రాజమహేంద్రవరం కార్పొరేషన్ల ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే 75 మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. వివిధ కారణాలతో 29 మున్సిపాలిటీ, పలు నగర పంచాయతీల్లో ఎన్నికను వాయిదా వేశారు.

వాయిదా పడిన 29 మున్సిపాలిటీలు:

1.శ్రీకాకుళం జిల్లాలో ఆముదాల వలస, రాజాం
2.పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు, తాడేపల్లి గూడెం, తణుకు, ఆకివీడు
3.కృష్ణా జిల్లాలో గుడివాడ, జగ్గయ్యపేట, కొండపల్లి
4.గుంటూరు జిల్లాలో బాపట్ల, మంగళగిరి, నరసరావుపేట, పొన్నూరు, తాడేపల్లి, గురజాల, దాచేపల్లి
5.ప్రకాశం జిల్లాలో కందుకూరు, దర్శి
6.నెల్లూరు జిల్లాలో గూడూరు, కావలి, బుచ్చిరెడ్డిపాలెం
7.చిత్తూరు జిల్లాలో శ్రీకాళహిస్తి, కుప్పం
8.కడప జిల్లాలో రాజేంపేట, కమలాపురం
9.కర్నూల్ జిల్లాలో బేతంచెర్ల
10. అనంతపురం జిల్లాలో పామిడి, పెనుకొండ

Read This Story Also: ‘ధక్ ధక్ ధక్’.. ఎంతో కొత్తగా.. డీఎస్పీ నువ్వు కేక..!