Uppena: ‘ధక్ ధక్ ధక్’.. ఎంతో కొత్తగా.. డీఎస్పీ నువ్వు కేక..!

మెగాస్టార్ మరో మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతోన్న చిత్రం ఉప్పెన. లెక్కల మాస్టార్ సుకుమార్ దగ్గర అసిస్టెంట్‌‌గా పనిచేసిన బుచ్చిబాబు సన ఈ మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

Uppena: 'ధక్ ధక్ ధక్'.. ఎంతో కొత్తగా.. డీఎస్పీ నువ్వు కేక..!
Follow us

| Edited By:

Updated on: Mar 09, 2020 | 7:20 PM

మెగాస్టార్ మరో మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతోన్న చిత్రం ‘ఉప్పెన’. లెక్కల మాస్టార్ సుకుమార్ దగ్గర అసిస్టెంట్‌‌గా పనిచేసిన బుచ్చిబాబు సన ఈ మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీలో నుంచి ధక్ ధక్ ధక్ అంటూ సాగే రెండో పాటను విడుదల చేసింది చిత్ర యూనిట్. మ్యూజిక్‌కు సౌండ్ ఎఫెక్ట్స్‌ను మిక్స్ చేస్తూ వచ్చిన ఈ పాట అదరగొట్టేస్తోంది. చంద్రబోస్ ఈ పాటకు సాహిత్యం అందించగా.. శరత్ సంతోష్, హరి ప్రియ ఆలపించారు. ముఖ్యంగా ఈ పాటకు రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కొత్తగా ఉండటంతో పాటు విన్న వెంటనే అందరినీ ఆకట్టుకుంటోంది. దానికి తోడు విజువల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి.

కాగా ప్రేమ కథగా తెరకెక్కిన ఈ మూవీలో వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి నటిస్తున్నారు. తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి విలన్‌గా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి గత వారం నుంచి వచ్చిన నీ కన్ను నీలి సముద్రం అనే పాట కూడా అందరికీ తెగ నచ్చేయగా.. సినిమాపై మంచి అంచనాలు మొదలయ్యాయి. ఇప్పుడు రెండో పాట కూడా అద్భుతంగా ఉండటంతో.. ఉప్పెనపై ఆ అంచనాలు మరింత పెరుగుతున్నాయి.