ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సీఎం జగన్ వరం..

| Edited By:

Jul 03, 2020 | 12:19 PM

ఏపీలో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఏడాది కాలంలోనే అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారు వైఎస్ జగన్. ఈ నేపథ్యంలో సీఎం మరో కీలక హామీని నెరవేర్చారు. ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్ అందించారు. ఇచ్చిన మాటలకు అనుగుణంగా..

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సీఎం జగన్ వరం..
Follow us on

ఏపీలో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఏడాది కాలంలోనే అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారు వైఎస్ జగన్. ఈ నేపథ్యంలో సీఎం మరో కీలక హామీని నెరవేర్చారు. ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్ అందించారు. ఇచ్చిన మాటలకు అనుగుణంగా ఏపీలోని ఔట్ సోర్సింగ్ సర్వీసెస్ కార్పొరేషన్ (ఆప్కాస్)ని ఏర్పాటు చేశారు సీఎం జగన్. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. పాదయాత్ర సమయంలో ఎంతో మంది కాంట్రాక్టు ఉద్యోగులు నా వద్దకు వచ్చి వారి బాధలను పంచుకున్నారు. ఇస్తామన్న జీతాలు ఇవ్వకుండా కోతలు విధించారని విలపించారు. అందుకే అప్పుడు వారికి ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు ఔట్‌సోర్సింగ్ సర్వీసెస్ కార్పొరేషన్‌ని ఏర్పాటు చేశాం.

అలాగే ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో 50 శాతం మహిళలకే కేటాయింపు ఉంటుందన్నారు. ఔట్ సోర్సింగ్ వ్యవస్థను మార్చుతాం. ఎవరికీ లంచాలు ఇవ్వకుండా ఉద్యోగాలు రావాలి. కొర్పొరేషన్ ఫర్ ఔట్ సోర్సెడ్ సర్వీసెస్ చైర్మన్‌గా సాధారణ పరిపాలన శాఖకి చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేదా ముఖ్య కార్యదర్శి లేదా ప్రభుత్వ కార్యదర్శి వ్యవహరిస్తారు. దీంతో అవినీతి జరగడానికి అవకాశం ఉండదని పేర్కొన్నారు సీఎం జగన్.

Read More:

ప్రగతి భవన్‌లో కరోనా కలకలం.. నలుగురు సిబ్బందికి కోవిడ్..

పీఎఫ్ విత్‌డ్రా చేసుకున్నారా? పన్ను పడే ఛాన్స్ ఉందట!