AP News: మద్యానికి బానిసై కొడుకును చంపిన తండ్రి.. జీవిత ఖైదు విధించిన కోర్టు..!

AP News: పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరు మండలం పారుపల్లిలో పారుపల్లి వెంకటేశ్వర్లు జీవనం సాగిస్తున్నాడు. వెంకటేశ్వర్లుకు ఇద్దరు కొడుకులు. చిన్న కొడుకు బాజీ తండ్రి వద్దే ఉంటూ సెంట్రింగ్ పనిచేసేవాడు. తనకు వచ్చిన కూలీ డబ్బులను తండ్రికి ఇచ్చి బ్యాంక్ లో జమ..

AP News: మద్యానికి బానిసై కొడుకును చంపిన తండ్రి.. జీవిత ఖైదు విధించిన కోర్టు..!
Ap News

Edited By:

Updated on: Sep 16, 2026 | 1:21 PM

AP News: మద్యానికి బానిసయ్యాడు. కొడుకు కష్టపడి సంపాదించిన డబ్బులను బ్యాంక్ లో డిపాజిట్ చేయకుండా మద్యం సేవించడానికి వినియోగించాడు. ఈ విషయం తెలుసుకున్న కొడుకు తండ్రిని మందలించడంతో ఆవేశానికి లోనయిన తండ్రి ఏకంగా కొడుకునే గొడ్డలితో నరికి చంపాడు. నేరం రుజువుకావడంతో కోర్టు ఆ తండ్రికి జీవిత ఖైదు విధించింది.

పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరు మండలం పారుపల్లిలో పారుపల్లి వెంకటేశ్వర్లు జీవనం సాగిస్తున్నాడు. వెంకటేశ్వర్లుకు ఇద్దరు కొడుకులు. చిన్న కొడుకు బాజీ తండ్రి వద్దే ఉంటూ సెంట్రింగ్ పనిచేసేవాడు. తనకు వచ్చిన కూలీ డబ్బులను తండ్రికి ఇచ్చి బ్యాంక్ లో జమ చేయమని చెప్పేవాడు. ఈ విధంగా కొంతకాలం గడిచిన తర్వాత బాజీ వివాహం చేసుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో తమ ఇంటికి మరమ్మత్తులు చేయాలని నిర్ణయించారు. దీంతో బాజీ బ్యాంక్ లో దాచిన డబ్బులు డ్రా చేసి తీసుకురావాలని తండ్రిని పదే పదే కోరాడు. అయినప్పటికీ తండ్రి తీసుకురావడంతో లేదు.

దీంతో అనుమానం వచ్చిన బాజీ తనే బ్యాంక్ వెళ్లి వాకబు చేయగా బ్యాంక్ లో బాలెన్స్ లేదని చెప్పారు. అసలు జమ చేయడం లేదని తెలుసుకున్న బాజీ తండ్రిని మందలించాడు. వ్యసనాలకు బానిసైన వెంకటేశ్వర్లు ప్రతి రోజూ కొడకు ఇచ్చిన డబ్బులతో జల్సాలు చేశాడు. కొడుకు వాకబు చేసి మందలించడంతో మనస్థాపానికి గురైన వెంకటేశ్వర్లు.. మద్యం సేవించి వచ్చి ఇంటిలో నిద్రపోతున్న కొడుకుపై గొడ్డలితో దాడి చేశాడు. తీవ్ర గాయాలైన బాజిని సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

బాజీ తల్లి సువార్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వెంకటేశ్వర్లను అరెస్ట్ చేశారు. కోర్టులో వాదోపవాదాలను, సాక్ష్యాధారాలను పరిశీలించి నేరం చేసినట్లు రుజువు కావడంతో వెంకటేశ్వర్లుకు గుంటూరు కోర్టు జీవిత ఖైదు విధించింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Loading...
Unable to load recommendations.
Follow Us