Andhra Pradesh: మామూలు దోపిడి కాదు.. ఆధార్‌లో అక్షరం మారాలంటే రూ.5000 కట్టాల్సిందే..

| Edited By: Shaik Madar Saheb

Nov 10, 2024 | 7:18 AM

వినియోగదారుల అవసరం వారికి కాసులు కురిపిస్తోంది.. వాళ్లు చేసే సేవకు ఫీజులు తీసుకుంటున్నప్పటికీ.. అడ్డంగా వేలకు వేలు దోచేస్తున్నారు. అక్షరం మారాలంటే 5000 ఇవ్వాల్సిందే.. ఇలా ఆధార్ సెంటర్ల నిర్వాహకులు అందిన కాడికి దోచుకుంటున్నారు.

Andhra Pradesh: మామూలు దోపిడి కాదు.. ఆధార్‌లో అక్షరం మారాలంటే రూ.5000 కట్టాల్సిందే..
Aadhaar Update Scam in Rajampet
Follow us on

ఆధార్ కార్డులో పొరపాటున ఒక్క అక్షరం దొర్లిన అడిగినంత సమర్పించాల్సిందే.. ఇక్కడ నిబంధనలతో పనే లేదు.. ఎక్కువసేపు నిల్చొవాల్సిన అవసరం లేదు.. పైసలిస్తే చాలు అప్పటికప్పుడే పనైపోతుంది.. ఇది రాజంపేట పట్టణంలో ఆధార్ సెంటర్ల నిర్వాహకులు బరితెగింపు. అక్షరం మార్చాలన్న 5000 నుంచి ఆ పైగే.. ఇలా వేలకు వేలు అందిన కాడికి దోచుకుంటున్నారు.. ఆధార్ సెంటర్ లపై అధికారుల నిఘా కొరవడటంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీనివల్ల పేద ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని ఆధార్ సెంటర్ నిర్వాహకులు బరితెగిస్తున్నారు. నిబంధనలు విస్మరించి ఇష్టానుసారంగ వ్యవహరిస్తున్నారు. ఆధార్ కార్డు లో మార్పులు చేర్పుల కోసం వెళ్లే వారిని ఇబ్బందులు పెడుతూ అధిక మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా రాజంపేట పట్టణంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పైన ఉన్న ఆధార్ సెంటర్ నిర్వాహకుల అక్రమాలకు అంతేలేకుండా పోయింది. ఆధార్ కార్డులో ఒక అక్షరం మార్చాలన్న కూడా 5000 రూపాయల నుంచి ఇష్టానుసారంగా అందిన కాడికి దోచుకుంటున్నారు. ముఖ్యంగా విద్యార్థులు దీనివల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

అసలు ఏం జరిగిందంటే..

యువరాజు యాదవ్ అనే ఒక పదవ తరగతి విద్యార్థి తన ఇంటి పేరులో ఒక అక్షరం మార్చడానికి ఆధార్ సెంటర్‌కు వెళ్ళాడు. వెంటనే మార్చాలంటే 5000 రూపాయలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశాడు.. చేసేది లేక అక్షరాల 5000 రూపాయలు ముడుపులు మొట్ట చెప్పాడు యువరాజు.. శ్వేత అనే ఓ విద్యార్థిని తన ఆధార్ కార్డులో డేటాఫ్ బర్త్ ను మార్చుకోవడానికి వెళ్లగా.. ఆమె వద్ద నుంచి 2000 రూపాయలు వసూలు చేసినట్లు చెప్పింది. భువనగిరి రెడ్డి సుస్మిత అనే విద్యార్థిని ఆధార్ లో పేరు మార్పు కోసం వెళ్లగా తన వద్ద నుంచి 2,800 రూపాయలు వసూలు చేసినట్లు వాపోయింది..

Aadhaar Update Scam

ఇలా ఒకరిద్దరు కాదు ఎంతోమంది ఆధార్ కార్డులో మార్పులు చేర్పుల కోసం వెళ్లి అధిక మొత్తంలో డబ్బులు చెల్లించడం జరుగుతుంది. సాధారణంగా ఆధార్ లో మార్పుల కోసం 50 రూపాయలు చెల్లించాల్సి ఉంది. అయితే, రాజంపేటలోని ఆధార్ నిర్వాహకులు మాత్రం అందిన కాడికి దోచుకుంటూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. మరికొందరు ఆధార్ సెంటర్ యజమానులు.. ఇక్కడ లేకున్నా ఇతరులకు తమ ఆధార్ సెంటర్‌లను అప్పగించి డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. ఆధార్ సెంటర్ లపై అధికారుల నిఘా కొరవరడం పర్యవేక్షణ లేకపోవడంతో సెంటర్ల నిర్వాహకులు ఇస్థారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

అసలు ఆధార్ సెంటర్లకు అనుమతులు ఉన్నాయా లేవా..? ఎవరి పేరుతో అనుమతులు ఉన్నాయి..? ఎవరు వాటిని నిర్వహిస్తున్నారు..? అన్నదానిపై అధికారుల నిఘా కొరవడింది.. దీంతో ఆధార్ యజమానులు ఆడిందే ఆటగా వేలకు వేలు దోచేస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు ఇప్పటికైనా స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలి.. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఆధార్ సెంటర్లకు కళ్లెం వేయాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..