Andhra Pradesh: హృదయ విదారకర ఘటన.. పడంటి బిడ్డను చూడకుండానే ప్రాణాలు విడిచిన ఎంపీడీవో!

| Edited By: Balaraju Goud

Dec 19, 2024 | 4:21 PM

ఏ తల్లైన పండంటి బిడ్డకు జన్మనిచ్చి మాతృహృదయంతో మురిసిపోతుంది. నవమాసాలు కడుపున కనుపాపను మోసి అమ్మ అనే పిలిపించుకోవాలనుకుంటుంది. అయితే నిండి గర్భిణి అయిన హరిప్రియ పురిటినొప్పులతో ఆసుపత్రిలో చేరింది. కాన్పు సమయంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చి, తాను మాత్రం కనులారా చూడకుండానే తుదిశ్వాస విడిచింది.

Andhra Pradesh: హృదయ విదారకర ఘటన.. పడంటి బిడ్డను చూడకుండానే ప్రాణాలు విడిచిన ఎంపీడీవో!
Haripriya Mpdo
Follow us on

తన ఆయువునే మరో ప్రాణంగా మలిచింది. నవమాసాలు కడుపున కనుపాపను మోసి అమ్మ అనే పిలుపునకు ఆమడ దూరంలో ఆగిపోయింది. ఆ గుండె మాతృత్వ మాధుర్యాన్ని ఆస్వాదించకుండానే ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చినా, తన కలల దీపాన్ని చూడకుండానే తుదిశ్వాస విడిచింది. ఇప్పుడు ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లాలో కలకలం రేపుతుంది.

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆ తల్లి బిడ్డను చూడకుండానే తుదిశ్వాస విడిచింది. ఇప్పుడెప్పుడూ తన బిడ్డను చూసుకుందామా అని ఎదురుచూసిన ఆ తల్లికి బిడ్డ భూమి మీదకు వచ్చే వేళనే ఆయువు తీరిపోయింది. ఈ హృదయ విదారకర ఘటన ఎన్టీఆర్ జిల్లా ఏ. కొండూరు మండలంలో చోటుచేసుకుంది. ఏ కొండూరు ఎంపీడీవో హరిప్రియ నిండు గర్భిణీ. మంగళవారం రాత్రి కాన్పు కోసం విజయవాడలోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో చేరగా ఆడబిడ్డకు జన్మనిచ్చారు.

గుండెకు సంబంధించిన వ్యాధి ఉండటంతో కాన్పు జరిగాక ఆమె ఒక్కసారిగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలో చికిత్స తీసుకుంటూనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే కన్న బిడ్డను కూడా చూడకుండా ప్రాణాలను విడిచారు. ఆమె భర్త హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు. 2018 లో గ్రూప్ వన్ పరీక్షల్లో ఎంపీడీవో ఉద్యోగం సాధించి, తూర్పుగోదావరి జిల్లాలో పలు మండలాల్లో హరిప్రియ బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం విజయవాడలో తల్లిదండ్రులు ఉండటంతో ఈ ఏడాది అక్టోబర్ 9న ఏ కొండూరు ఎంపీడీవో గా బాధ్యతలు చేపట్టి నవంబర్ నుంచి ఆమె మెటర్నిటీ సెలవులో ఉండిపోయారు.

హరిప్రియ నిండు గర్భిణీ కావడంతో పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో మంగళవారం రాత్రి కాన్పు కోసం విజయవాడలోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబసభ్యులు. ఇంతలోనే ఆమె అనారోగ్యానికి గురయ్యారు. వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. చివరికి పడంటి ఆడబిడ్డకు జన్మనిచ్చి తానూ మాత్రం తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..