Watch: ప్రపంచ రికార్డు థింసాతో ప్రధానికి గ్రాండ్ వెల్‌కమ్.. భోగాపురం మెరిసింది..

Updated on: Aug 01, 2026 | 11:12 AM

విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఆకాశం నుంచి చూస్తే అద్భుతంగా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రతీకగా నిలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికేందుకు విమానాశ్రయ ప్రాంగణంలో వేలాది మంది గిరిజన కళాకారులు సంప్రదాయ థింసా నృత్యం ప్రదర్శించారు.

విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఆకాశం నుంచి చూస్తే అద్భుతంగా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రతీకగా నిలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికేందుకు విమానాశ్రయ ప్రాంగణంలో వేలాది మంది గిరిజన కళాకారులు సంప్రదాయ థింసా నృత్యం ప్రదర్శించారు. ఏకరూప దుస్తుల్లో భారీ సంఖ్యలో కళాకారులు పాల్గొన్న ఈ థింసా నృత్య ప్రదర్శన ఇప్పటికే ప్రపంచ రికార్డు (గిన్నిస్ వరల్డ్ రికార్డు) సాధించి ప్రత్యేక గుర్తింపు పొందింది. తెలుగు సంస్కృతి, గిరిజన కళా వైభవాన్ని ప్రతిబింబించిన ఈ స్వాగత కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Aug 01, 2026 11:10 AM
Loading...
Unable to load recommendations.
Follow Us