Agnipath Protest: అగ్నిపథ్ అల్లర్లతో ట్రైన్‌ నిలిపివేత.. ఆ కుటుంబానికి గుండెకోత.. అసలేమైందంటే..

|

Jun 18, 2022 | 4:14 PM

కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ ‌(Korba Express) ను కొత్తవలసలో నిలిపివేయడంతో చికిత్స కోసం ఒడిశా నుంచి వచ్చిన జోగేష్‌ బెహరా (70) అనే వృద్ధుడు మార్గమధ్యలో రైలులోనే మృతి చెందాడని అధికారులు తెలిపారు.

Agnipath Protest: అగ్నిపథ్ అల్లర్లతో ట్రైన్‌ నిలిపివేత.. ఆ కుటుంబానికి గుండెకోత.. అసలేమైందంటే..
Special Trains
Image Credit source: TV9 Telugu
Follow us on

Agnipath Scheme protests: అగ్నిపథ్ అల్లర్లు ఓ వృద్ధుడి ప్రాణం తీశాయి. హార్ట్ ఆపరేషన్ కోసం తరలిస్తుండగా.. మార్గమధ్యలో ట్రైన్ నిలిపివేయంతో ఛాతీలో నొప్పి ఎక్కువకావడంతో వృద్ధుడు మృతిచెందాడు. ఈ ఘటన విజయనగరంలో చోటుచేసుకుంది. కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ ‌(Korba Express) ను కొత్తవలసలో నిలిపివేయడంతో చికిత్స కోసం ఒడిశా నుంచి వచ్చిన జోగేష్‌ బెహరా (70) అనే వృద్ధుడు మార్గమధ్యలో రైలులోనే మృతి చెందాడని అధికారులు తెలిపారు. బెహరా కొంతకాలంగా గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో చికిత్స కోసం ఒడిశా నుంచి విశాఖపట్నంకు అతని కుటుంబ సభ్యులు కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌‌‌లో పయనమయ్యారు.

అయితే.. అగ్నిపథ్ అల్లర్ల నేపథ్యంలో విశాఖ వెళ్లాల్సిన రైలును కొత్తవలసలోనే నిలిపివేశారు. ఈ సమయంలో జోగేష్‌‌కు ఛాతినొప్పి ఎక్కువ కావడంతో ఇబ్బందిపడ్డాడు. అంబులెన్స్ లేకపోవడంతో అతన్ని కొత్తవలసలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ప్రాథమిక చికిత్స చేస్తుండగానే జోగేష్ బెహరా మృతి చెందాడు. దీంతో మృతుడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..