Andhra News: 28 ఏళ్లుగా ఆ స్వామివారినే కొలుస్తున్నాడు.. కట్ చేస్తే.. కోరిక తీర్చినందుకు దేవుడికి ఊహించని గిఫ్ట్..

| Edited By: Velpula Bharath Rao

Dec 20, 2024 | 8:07 AM

తూర్పుగోదావరి జిల్లా లక్ష్మీ గణపతికి లక్ష కుడుముల మొక్కును హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తుడు తీర్చుకున్నాడు. ని హైదరాబాదులో నివాసం ఉండే పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు గ్రామానికి చెందిన తాళ్ల పిచ్చిరెడ్డి, గంగ దంపతులు గత 28 ఏళ్లుగా తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులోని స్వయంభూ శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారిని కొలుస్తూ వస్తున్నారు.

Andhra News: 28 ఏళ్లుగా ఆ స్వామివారినే కొలుస్తున్నాడు.. కట్ చేస్తే.. కోరిక తీర్చినందుకు దేవుడికి ఊహించని గిఫ్ట్..
One Lakh Kudumulu
Follow us on

తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులోని స్వయంభూ శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారిని హైదరాబాదులో నివాసం ఉండే పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు గ్రామానికి చెందిన తాళ్ల పిచ్చిరెడ్డి, గంగ దంపతులు దర్శించుకున్నారు. గత 28 ఏళ్లుగా శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారిని కొలుస్తూ వస్తున్నారు. ఈ సందర్భంగా పిచ్చిరెడ్డి దంపతులు రెండేళ్ల క్రితం తమ కోరిక తీర్చితే లక్ష కుడుములు సమర్పించుకుంటామని మొక్కుకున్నారు. శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ఆశీస్సులతో కోరిక తీరడంతో గురువారం బొజ్జ గణపయ్యకు లక్ష కుడుములు చెల్లించేందుకు బిక్కవోలు చేరుకున్నారు. ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ప్రాంగణంలోనే కుడుములు తయారీకి శ్రీకారం చుట్టారు. ఎప్పటికప్పుడు భక్తులు నిష్ఠగా తయారు చేసిన కుడుములను లెక్క చూస్తూ స్వామివారికి సమర్పించి వాటిని చుట్టుపక్కల గ్రామాల్లో భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తున్నారు. ఈ లక్ష కుడుములు తయారీకి బిక్కవోలు గ్రామానికి చెందిన మహిళ, పురుష భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి సేవగా భావించి పిచ్చిరెడ్డి దంపతులకు తమ పూర్తి సహకారాన్ని అందించారు. ఈ సందర్భంగా పిచ్చిరెడ్డి దంపతులు స్వామి వారు తమ కుటుంబంతో పాటు బిక్కవోలు గ్రామస్తులకు సైతం దివ్య ఆశీస్సులు అందించాలని స్వామివారిని కోరుకున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి