
2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న రాష్ట్రం 2014 ఎన్నికల్లో మోదీ ప్రధాని అయ్యే సరికి రెండు ముక్కలైంది. ఆంధ్రప్రదేశ్ వ్యవస్థీకరణ చట్టం 2014 తో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, విభజన హామీల అమలు, మౌలిక వసతుల కల్పన కోసం కీలక చర్యలు తీసుకుంది. 2014లో రాష్ట్ర విభజన అనంతరం ఏపీని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్రం ప్రత్యేక చొరవ తీసుకుంది..
12 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి మోదీ ప్రభుత్వం చేసిన కేటాయింపులు గత 12 ఏళ్లలో కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి వివిధ రంగాల్లో భారీ కేటాయింపులు చేసింది.పేదరిక నిర్మూలన నుంచి మౌలిక వసతులు, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత వరకు అనేక పథకాల ద్వారా రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని కేంద్రం రాష్ట్రానికి అందించింది
ఏపీలో పేదరిక నిర్మూలన – సంక్షేమం
పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు తీసుకువచ్చిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) కింద రికార్డు స్థాయిలో ఏపీకి కేంద్రం ఇళ్లు మంజూరు చేసింది. పట్టణ ప్రాంతంలో 21.32 లక్షలు, గ్రామీణ ప్రాంతంలో 2.47 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. పట్టణ పేదల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం 23,200 కోట్లు సాయం అందించింది. పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద ఏపీలో 2.68 కోట్ల మందికి ఉచిత రేషన్ అందించారు. పీఎం స్వనిధి కింద ఏపీలో 2.59 లక్షల మంది వీధి వ్యాపారులకు 304.8 కోట్ల రుణాలు మంజూరు చేశారు. రాష్ట్రంలో 1.31 కోట్ల జన్ ధన్ ఖాతాలు తెరిచి, 87.5 లక్షల రూపే కార్డులు జారీ చేశారు.ఏపీలో యువతకు ముద్రా యోజన కింద 60.82 లక్షల మందికి 82,017 కోట్ల రుణం అందించారు…టిడ్కో ఇళ్ల కోసం హడ్కో ద్వారా రూ.4,400 కోట్లు కేటాయించారు.
ఏపీ రైతులకు చేయూత
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఏపీలో 41.5 లక్షల రైతులకు ఏటా 6,000 సాయం అందుతోంది. 1,930 గ్రామాల్లో సంపూర్ణ బీమా గ్రామ యోజన అమలు చేశారు. రైతుల ఉత్పత్తుల రవాణా కోసం 116 కిసాన్ రైళ్ల సర్వీసులు నడుపుతున్నారు. బిందు సేద్యం ద్వారా 1.36 లక్షల హెక్టార్లకు సాగునీరు అందించారు. ఈ-నామ్ ద్వారా 33 వ్యవసాయ మార్కెట్లను అనుసంధానం చేశారు. మైదుకూరు, ఆత్మకూరులో నూతన కృషి విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఏపీ గ్రామీణాభివృద్ధికి సహకారం
ఉపాధి హామీ పథకం కింద ఏపీలో 95 లక్షల మందికి ఉపాధి కల్పించి 67 వేల కోట్లును ఖర్చు చేశారు.ఏపీలో ద్వాక్రా మహిళలకు రూ.1.53 లక్షల కోట్ల రుణాలు అందించారు. 6,830 గ్రామాలు బహిరంగ మలవిసర్జన రహితం (ODF)గా గుర్తింపు పొందాయి. ఏపీలో 42.39 లక్షల వ్యక్తిగత, 14,605 కమ్యూనిటీ మరుగుదొడ్లు నిర్మించారు. జల్ జీవన్ మిషన్ ద్వారా 35.88 లక్షల ఇళ్లకు మంచినీరు అందించారు..ఇందుకోసం 7,750 కోట్లు ఖర్చు చేశారు.
ఏపీలో మహిళా సాధికారతకు సాయం
ఏపీలో పోషణ అభియాన్ కింద 27.25 లక్షల మంది తల్లులు, పిల్లలకు పౌష్టికాహారం అందించారు. మాతృ వందన యోజన కింద 14.32 లక్షల గర్భిణులకు రూ. 647 కోట్లు సాయం చేశారు. ఆశ్రయం కోసం 200 ఉజ్వల గృహాలు, 21 స్పందన్ గృహాలు, 12 సఖి నివాస్ హాస్టళ్లు ఏర్పాటు చేశారు. వన్ స్టాప్ సెంటర్ల ద్వారా 37,582 మంది బాధిత మహిళలకు రక్షణ కల్పించారు. పీఎం ఉజ్వల కింద 5.12 లక్షల ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. ఇప్పటివరకు సుకన్య సమృద్ధి యోజన ద్వారా 15.53 లక్షల బాలికలకు లబ్ధి చేకూరింది.
మౌలిక సదుపాయాలు..రహదారులు,
ఏపీలో జాతీయ రహదారుల నిడివి 4,193 కి.మీ. నుంచి 8,744 కి.మీ.కు పెంచారు. రూ.45,000 కోట్లతో 5 కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేలు (636 కి.మీ.) నిర్మిస్తున్నారు. రైల్వే బడ్జెట్ కేటాయింపు సగటు రూ. 886 కోట్ల నుంచి రూ.10,134 కోట్లకు (2026) పెరిగింది. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటు చేశారు. 73 అమృత్ స్టేషన్ల ఆధునీకరణ జరుగుతోంది. తిరుపతి, వైజాగ్, విజయవాడ ఎయిర్‌పోర్టులను అంతర్జాతీయ స్థాయికి అభివృద్ధి చేస్తున్నారు. భోగాపురం, ఓర్వకల్లులో నూతన విమానాశ్రయాలు ఏర్పడుతున్నాయి. సాగరమాల కింద రూ.2,500 కోట్లతో 14 పోర్టుల అభివృద్ధి జరుగుతుంది. 8 ఫిషింగ్ హార్బర్లు, 3 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు నిర్మిస్తున్నారు.
సికింద్రాబాద్ – విశాఖపట్నం, తిరుపతి – సికింద్రాబాద్, విజయవాడ – చెన్నై వంటి మార్గాల్లో అత్యాధునిక వందేభారత్ రైళ్లను ప్రారంభించారు.సముద్ర తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకునేలా రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట (కళింగపట్నం) పోర్టుల అభివృద్ధికి కేంద్రం పూర్తి మద్దతునిచ్చింది. విశాఖ – చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ (VCIC), చెన్నై – బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధికి, అలాగే కడప (కొప్పర్తి), కర్నూలు ప్రాంతాలలో పారిశ్రామిక క్లస్టర్ల ఏర్పాటుకు పెద్దపీట వేశారు.
వైద్యం..విద్యా రంగాల అభివృద్ధికి సహకారం
నేషనల్ హెల్త్ మిషన్ కింద ఏపీకి రూ.3,412 కోట్లు మంజూరు చేశారు. 17 కొత్త మెడికల్ కాలేజీలు, 3 నర్సింగ్ కాలేజీలకు కేంద్రం అనుమతి ఇచ్చింది.రూ.1,000 కోట్లతో బల్కడగ్ పార్క్, వైజాగ్‌లో మెడ్‌టెక్ పార్క్ ఏర్పాటు చేస్తున్నారు.. సమగ్ర శిక్షా అభియాన్ కింద బడుల్లో వసతులకు రూ.7,480 కోట్లు కేటాయించారు.2014 విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా ఏపీ అభివృద్ధి కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ప్రముఖ జాతీయ విద్యా, వైద్య సంస్థలను కేంద్రం ఏపీలో ఏర్పాటు చేసింది.
గుంటూరు జిల్లా మంగళగిరిలో అత్యాధునిక వసతులతో కూడిన ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్,తిరుపతిలో ఐఐటీ (IIT), విశాఖపట్నంలో ఐఐఎం (IIM), తాడేపల్లిగూడెంలో ఎన్‌ఐటీ (NIT) శ్రీకాళహస్తి సమీపంలో ఐఐఐటీల ఏర్పాటు చేసింది.అనంతపురంలో కేంద్ర విశ్వవిద్యాలయం, విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్రం నిధులు కేటాయించి ప్రారంభించింది.
పట్టణాభివృద్ధి – పరిశ్రమల ఏర్పాటు
స్మార్ట్ సిటీస్ (విశాఖ, కాకినాడ, తిరుపతి, అమరావతి) అభివృద్ధికి వేల కోట్ల నిధులు కేంద్రం కేటాయించింది. అమృత్ పథకం ద్వారా 32 పట్టణాల్లో మౌలిక వసతులకు 3,334 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, 5 డెవలప్‌మెంట్ నోడ్లు మంజూరు చేశారు. రామాయపట్నంలో రూ.95,000 కోట్లతో బీపీసీఎల్ భారీ రిఫైనరీ ఏర్పాటు జరుగుతుంది. వైజాగ్‌లో 15 బిలియన్ డాలర్లతో గూగుల్ ఏఐ డేటా హబ్ ఏర్పాటు జరుగుతుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు పునరుద్ధరణ ప్యాకేజీలు కేంద్రం ప్రకటించింది
రాజధాని నిర్మాణానికి సహకారం
అమరావతి రాజధాని నిర్మాణానికి 2024లో 15,000 కోట్లు, హడ్కో ద్వారా మరో 11,000 కోట్లు సాయం కేంద్రం అందించింది.. అమరావతికి కొత్త రైల్వే లైన్ కోసం రూ.2,245 కోట్లు కేటాయించింది. పోలవరం జాతీయ ప్రాజెక్టుకు డిసెంబర్ 2025 నాటికి 20,658 కోట్ల నిధులను కేంద్రం ఇచ్చింది. రాష్ట్రంలో 7 సాగునీటి ప్రాజెక్టులకు (PMKSY-AIBP) కింద 464 కోట్ల సాయం అందించారు. గత 12 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ ఏపీ సమగ్ర అభివృద్ధికి సాయాన్ని అందిస్తుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.