టోల్ గేట్ సిబ్బంది చెంప పగలగొట్టిన ఘటన: ఏపీ వడ్డెర కార్పొరేషన్ చైర్ పర్సన్ దేవళ్ల రేవతి వివరణ

టోల్‌గేట్ దగ్గర బిల్లు కట్టకుండా హంగామా చేసి అడ్డుకున్న సిబ్బంది లెంప పగలగొట్టిన ఆంధ్రప్రదేశ్ వడ్డెర కార్పొరేషన్ చైర్ పర్సన్ దేవళ్ల రేవతి జరిగిన..

టోల్ గేట్ సిబ్బంది చెంప పగలగొట్టిన ఘటన: ఏపీ వడ్డెర కార్పొరేషన్ చైర్ పర్సన్ దేవళ్ల రేవతి వివరణ
Follow us

|

Updated on: Dec 10, 2020 | 4:52 PM

టోల్‌గేట్ దగ్గర బిల్లు కట్టకుండా హంగామా చేసి అడ్డుకున్న సిబ్బంది లెంప పగలగొట్టిన ఆంధ్రప్రదేశ్ వడ్డెర కార్పొరేషన్ చైర్ పర్సన్ దేవళ్ల రేవతి జరిగిన ఘటనపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. “నాకు టోల్ గేట్ దాటేందుకు లోకల్ పాస్ ఉంది.. నా తల్లి అనారోగ్యం కారణంగా అత్యవసర దారిలో వెళ్లేందుకు ప్రయత్నం చేశాను.. టోల్ ప్లాజా సిబ్బంది నన్ను అడ్డుకున్నారు.. నేషనల్ హైవే ఆదరిటీ ఆఫ్ ఇండియా నిబంధనలు పాటించాను.. అత్యవసర సమయంలో వాహనాలు అపకూడదనే నిబంధన ఉంది.. నేను రెగ్యులర్ గా టోల్ ప్లాజా దారినుంచే వెళ్తాను.. అత్యవసర సమయం కావడంతో పక్కదారి నుంచి వెళ్ళాను.” అని ఆమె స్పష్టత నిచ్చే ప్రయత్నం చేశారు. అంతేకాదు, ఘటనా స్థలంలో 30 నిమిషాల సీసీ ఫుటేజ్ తీస్తే ఘటన అర్ధమవుతుందని, కేవలం నా ఫుటేజ్ మాత్రమే బయట పెట్టి తప్పుడుగా చిత్రీకరిస్తున్నారని ఆమె అన్నారు. తనపై టోల్ సిబ్బంది దుర్బర్షాలు ఆడిన వీడియో రిలీజ్ చేస్తాను.. టోల్ సిబ్బంది వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆమె చెప్పుకొచ్చారు.   రూ.60 కోసం ఏపీ వడ్డెర కార్పొరేషన్ చైర్ పర్సన్ హంగామా.. టోల్ గేట్ సిబ్బందిపై దేవళ్ల రేవతి దాడి..