అరటి ఎగుమతులు.. టాప్‌లో ఏపీ

అరటి ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌ టాప్‌గా నిలిచింది. ఐదేళ్ల కిందట రాష్ట్రంలో 79 వేల హెక్టార్లకే పరిమితమైన అరటి సాగు ఇప్పుడు 1.05 లక్షల హెక్టార్లకు చేరి అనూహ్య ప్రగతిని సాధించింది.

అరటి ఎగుమతులు.. టాప్‌లో ఏపీ
Follow us

| Edited By:

Updated on: Aug 24, 2020 | 7:07 AM

Banana Farming AP: అరటి ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌ టాప్‌గా నిలిచింది. ఐదేళ్ల కిందట రాష్ట్రంలో 79 వేల హెక్టార్లకే పరిమితమైన అరటి సాగు ఇప్పుడు 1.05 లక్షల హెక్టార్లకు చేరి అనూహ్య ప్రగతిని సాధించింది. ఈ నేపథ్యంలో 2020 సంవత్సరానికి గానూ జాతీయ స్థాయిలో ఏపీకి పురస్కారం లభించింది. ఈ పురస్కారాన్ని రాష్ట్ర ఉద్యాన శాఖ కమిషనర్‌ చిరంజీవి చౌదురి అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీని వెనుక రైతుల ఆసక్తి, ఉద్యాన శాఖ సిబ్బంది కృషి ఉన్నాయని అన్నారు.

టిష్యూ కల్చర్‌ ల్యాబ్స్, మైక్రో ఇరిగేషన్, ఫలదీకరణలో కొత్త పోకడల వలన అరటి సాగుతో పాటు ఉత్పాదకత, ఉత్పత్తి రెండూ పెరిగాయని చిరంజీవి తెలిపారు. టిష్యూ కల్చర్‌ వచ్చిన తర్వాత సుమారు 50 శాతం మేర సాగు విస్తీర్ణం పెరిగిందని వివరించారు. అలాగే ఉద్యాన శాఖ కూడా రైతులకు అనుకూల విధానాలను అమలు చేసిందని తెలిపారు. రైతుల కోసం కాయ కోత, కోత తరువాత జాగ్రత్తలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల(ఎఫ్‌పీవో)ను ఏర్పాటు చేసిందని, ప్యాక్ హౌజ్‌ల నిర్మాణంతో రైతులకు మేలు చేకూర్చిందని చిరంజీవి పేర్కొన్నారు. ఇక మధ్య తూర్పు దేశాలైన ఈజిప్ట్, సౌదీ అరేబియా, ఖతార్, ఇరాన్, బహ్రెయిన్, యూఏఈ దేశాలు ఆంధ్రప్రదేశ్‌ అరటి పండ్లపై ఆసక్తి చూపడంతో ఎగుమతులు గణనీయంగా పెరిగాయని ఆయన వివరించారు.

Read More:

బాలకృష్ణ గొప్ప మనసు.. కోవిడ్ ఆసుపత్రికి భారీ విరాళం..

73 రోజుల్లో కోవిడ్ వ్యాక్సిన్.. క్లారిటీ ఇచ్చిన సీరమ్ సంస్థ..

Latest Articles
అసలేంటీ ఆఫీస్ పికాకింగ్.. దీని ఉద్దేశం ఏంటి.?
అసలేంటీ ఆఫీస్ పికాకింగ్.. దీని ఉద్దేశం ఏంటి.?
పైన పటారం చూసి పూటకూళ్ల ఇల్లు అనుకునేరు.. లోపలకెళ్లి చూడగా.!
పైన పటారం చూసి పూటకూళ్ల ఇల్లు అనుకునేరు.. లోపలకెళ్లి చూడగా.!
నాగార్జున సినిమాకు ఆ స్టార్ హీరో అసిస్టెంట్ డైరెక్టర్..
నాగార్జున సినిమాకు ఆ స్టార్ హీరో అసిస్టెంట్ డైరెక్టర్..
ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ వేసేదీ ఎప్పుడంటే?
ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ వేసేదీ ఎప్పుడంటే?
డీహైడ్రేట్ బారిన పడుతున్నారా డైట్‌లో ఈ జ్యుసి పండ్లను చేర్చుకోండి
డీహైడ్రేట్ బారిన పడుతున్నారా డైట్‌లో ఈ జ్యుసి పండ్లను చేర్చుకోండి
అందం ఆ బ్రహ్మ వరం పొంది.. ఈ వయ్యారి రూపంలో మానవ జన్మ తీసుకుందోమో.
అందం ఆ బ్రహ్మ వరం పొంది.. ఈ వయ్యారి రూపంలో మానవ జన్మ తీసుకుందోమో.
ఏటీఎమ్‌లో మీ కార్డు ఇరుక్కుపోయిందా.? జాగ్రత్త, అది పెద్ద మోసం
ఏటీఎమ్‌లో మీ కార్డు ఇరుక్కుపోయిందా.? జాగ్రత్త, అది పెద్ద మోసం
కోట్ల ఆస్తులు, లగ్జరీ లైఫ్‌ కాదనుకున్నారు..! సన్యాసం స్వీకరించి
కోట్ల ఆస్తులు, లగ్జరీ లైఫ్‌ కాదనుకున్నారు..! సన్యాసం స్వీకరించి
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. భారత మ్యాచ్‌లకు ఇకపై ఆ సమస్య లేదంట..
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. భారత మ్యాచ్‌లకు ఇకపై ఆ సమస్య లేదంట..
మాడు పగిలే ఎండలు..123 ఏళ్లలో 2వసారి అత్యధిక ఉష్ణోగ్రతలు.. మే లోనూ
మాడు పగిలే ఎండలు..123 ఏళ్లలో 2వసారి అత్యధిక ఉష్ణోగ్రతలు.. మే లోనూ