ఆసియన్ అమెరికన్లపై పెరుగుతున్న దాడులు, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఆందోళన

| Edited By: Anil kumar poka

Mar 20, 2021 | 11:11 AM

ఆసియన్ అమెరికన్లపై దాడులు పెరుగుతుండంపట్ల అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు. వీటికి అడ్డుకట్ట వేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇటీవల  జార్జియాలోని

ఆసియన్ అమెరికన్లపై పెరుగుతున్న దాడులు, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఆందోళన
We Have To Act Says Us President Joebiden On Attacks On American Asians
Follow us on

ఆసియన్ అమెరికన్లపై దాడులు పెరుగుతుండంపట్ల అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు. వీటికి అడ్డుకట్ట వేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇటీవల  జార్జియాలోని అట్లాంటా లో ఓ వ్యక్తి మూడు స్పాలలో చొరబడి 8 మందిని కాల్చి చంపాడు. వీరిలో ఆరుగురు ఆసియన్ మహిళలు ఉన్నారు.  ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన బైడెన్..రేసిజం, జీనోఫోబియాను దేశం సహించజాలదన్నారు.  జార్జియాలోని ఆసియన్ అమెరికన్లతో సమావేశమైన ఆయన.. ఇక తమ ప్రభుత్వం ఈవిధమైన ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. రేసిజం విషం లాంటిదని, దేశాన్ని ఇది వెన్నాడుతోందని ఆయన చెప్పారు.  ఈ విధమైన హింసను ఇన్నాళ్ళూ అమెరికా మౌనంగా చూస్తూ వచ్చిందని ఆయన.. పరోక్షంగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిందని, ఇక రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పారు.  హింస అన్నది కరోనా వైరస్ వంటిదేనని, దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సి ఉందన్నారు. అట్లాంటా ఘటనలో మృతి చెందినవారి కుటుంబాల క్షోభ చెప్పనలవి కాదని, మృతుల ఒక్కొక్కరి జీవితం వారి కుటుంబ సభ్యులపై ఎంతో ప్రభావం చూపుతూ వచ్చిందని తెలుసుకున్నానని బైడెన్ అన్నారు.

కాగా… రాబర్ట్ అనే 21 ఏళ్ళ యువకుడు ఇటీవల మూడు స్పాలలో ప్రవేశించి తన గన్ తో విచక్షణపూరితంగా కాల్పులు జరిపి 8 మందిని పొట్టన బెట్టుకున్నాడు. మృతుల్లో ఓ శ్వేత జాతీయుడు కూడా ఉన్నారు. ఈ ఘటన రెసిజానికి, సెక్సిజానికి సంబంధించిందా అన్న విషయమై ఫెడరల్ పోలీసులు ఇంకా దర్యాప్తు జరుపుతున్నారు. రాబర్ట్ చదువుకునే రోజుల్లో ఎంతో సౌమ్యంగా ఉండేవాడని, అతనిలో రేసిజం పోకడలు ఏనాడూ కనబడలేదని 2017 లో అతనితో కలిసి చదువుకున్న అతని సహచరుడొకరు చెప్పారు. తమ ఫ్రెండ్ ఈ విధమైన హింసకుపాల్పడ్డాడంటే నమ్మలేకపోతున్నానని అన్నాడు. అటు– జార్జియా ఘటనతో ఆసియన్ అమెరికన్లు అధిక సంఖ్యలో ఉన్న  న్యూయార్క్, షికాగో, సీటేల్స్,  శాన్ ఫ్రాన్సిస్కో వంటి పలు నగరాల్లో పోలీసు భద్రతను పెంచారు.
మరిన్ని చదవండి ఇక్కడ :ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన స్నేక్ ఐలాండ్ వీడియో…ఒళ్ళు గగ్గురుపరిచే నిజాలు : Snake Island Videoఆర్ ఆర్ ఆర్ మరో సినిమా..ఆసక్తికరంగా మారిన ప్రకటన :Paired Opposite Jr NTR In RRR Video.
 ‘క్యాట్ షేరింగ్.. కేరింగ్..’ ఆ పిల్లులు ఎంత ప్రాణ స్నేహితులో… ఈ వీడియోని చూసి నెటిజెన్స్ ఫిదా.. ( వీడియో )