Viral Video: ముద్దుల ముచ్చట్లు.. సోషల్ మీడియాను కుదిపేస్తున్న వీడియో.. ఇందులో ఈ ఇద్దరు ఎవరో తెలుసా..

ఇప్పుడు అగ్రరాజ్యంలో ఇదే చర్చ. ముద్దు.. ముచ్చట్లు.. ప్రపంచ వ్యాప్తంగా ఆ ఇద్దరిపైనే డిస్కషన్ మొదలైంది. వారి ముద్దుల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తోంది. 

Viral Video: ముద్దుల ముచ్చట్లు.. సోషల్ మీడియాను కుదిపేస్తున్న వీడియో.. ఇందులో ఈ ఇద్దరు ఎవరో తెలుసా..
Joe Biden's Wife Kisses Kamala Harris's Husband

Updated on: Feb 08, 2023 | 9:10 PM

ముద్దులు.. ముచ్చట్లు.. అమెరికా ప్రతినిధుల సభలో డెమోక్రటిక్ పార్టీ మెజారిటీ కోల్పోయింది. ఆ తర్వాత, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మంగళవారం కాపిటల్ హిల్‌లో మొదటిసారిగా దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉంది. అమెరికా పౌరులు, డెమొక్రాటిక్ పార్టీ సభ్యులు ప్రెసిడెంట్ చేసిన ప్రసంగంపై చర్చ జరగాల్సి ఉంది. కానీ ప్రెసిడెంట్ ప్రసంగం పక్కన పెట్టి  అమెరికా ప్రథమ మహిళ  జిల్ బిడెన్‌ను చుట్టేసింది. స్టేట్ ఆఫ్ ది యూనియన్ అడ్రస్ ముందు.. ఆమె,  వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ భర్త లిప్ కిస్ పెట్టుకున్నవీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీంతో బిడెన్ భార్య జిల్ బిడెన్, కమల భర్తపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

వైరల్ అయిన వీడియో, కాపిటల్ హిల్‌లోని ప్రతినిధుల సభ సెషన్ ఛాంబర్‌లో ఉన్న సభ్యులను చూపిస్తుంది. ఆమె సీటులో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కూడా ఉన్నారు. ఆ సమయంలో జో బిడెన్ భార్య జిల్ బిడెన్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అతని కంటే ముందు, కమల భర్త డగ్ ఎమ్‌హాఫ్ వద్దకు వచ్చిన జిల్ వచ్చి డౌగ్‌ని పలకరిస్తుంది. ఆ తర్వాత ఆమె అతనిని ముద్దుపెట్టుకుంది.

ఇవి కూడా చదవండి

దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఈ వీడియోపై ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. జిల్-డగ్ కిస్ కొద్దిసేపటికే ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. చాలా మంది ఇంటర్నెట్‌లో ఆడుకుంటున్నారు. వారు నిజంగా ఒకరి పెదాలను ఒకరు ముద్దు పెట్టుకున్నారా లేదా అని! కొందరు ‘సెక్సీ స్టార్ట్’ అని మరొకరు కామెంట్స్ విసురుతున్నారు.


మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం