ట్విటర్ ను నిషేధించారా..? గుడ్ ! నైజీరియాకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందన.

| Edited By: Anil kumar poka

Jun 09, 2021 | 3:11 PM

ట్విటర్ ను బ్యాన్ చేసినందుకు నైజీరియాను అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందించారు. మరిన్ని ఇతర దేశాలు కూడా ఈ విధమైన చర్య తీసుకోవాలని ఇదే సమయంలో ఫేస్ బుక్ ని కూడా బ్యాన్ చేయాలని ఆయన కోరారు...

ట్విటర్ ను నిషేధించారా..? గుడ్ !  నైజీరియాకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  అభినందన.
Trump Hails Twitter Ban In Nigeria
Follow us on

ట్విటర్ ను బ్యాన్ చేసినందుకు నైజీరియాను అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందించారు. మరిన్ని ఇతర దేశాలు కూడా ఈ విధమైన చర్య తీసుకోవాలని ఇదే సమయంలో ఫేస్ బుక్ ని కూడా బ్యాన్ చేయాలని ఆయన కోరారు. నైజీరియా అధ్యక్షుడు మహమ్మద్ బుహారీ చేసిన ట్వీట్ తమ నిబంధనలను అతిక్రమించేదిగా ఉందని, మారణ కాండకు దారి తీసేట్టు ముప్పు కలిగించేలా ఉందంటూ ట్విటర్ దాన్ని తొలగించింది. అయితే తాను వెంటనే డెలిట్ చేసినదాన్ని ట్విటర్ పేర్కొందని నైజీరియా అధ్యక్షుడు విమర్శించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ సామాజిక మాధ్యమాన్ని నైజీరియా ప్రభుత్వం బ్యాన్ చేసింది. దీనిపై స్పందించిన ట్రంప్..మరిన్ని ఇతర దేశాలు కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకోవాలని అంటూ..స్వేచ్ఛగా ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాలను తెలియజేసే హక్కును ట్విటర్, ఫేస్ బుక్ రెండూ అణగదొక్కుతున్నాయని ఆరోపించారు. అన్ని గళాలను ఇవి కవర్ చేయాల్సిందే అన్నారు.

జనవరి 6 న వాషింగ్టన్ లోని కేపిటల్ హిల్ లో జరిగిన దాడి అనంతరం ట్విటర్ ట్రంప్ ఖాతాను శాశ్వతంగా సస్పెండ్ చేసింది. నాడు ఆయనకు, ట్విటర్ కు మధ్య ‘వార్’ వంటిది జరిగింది. అప్పటినుంచి ట్రంప్ తన సొంత ట్విటర్ పైనే ఆధారపడుతున్నారు. ఇక ఫేస్ బుక్-రీవాల్యుయెషన్ కి ముందు మరో రెండేళ్ల పాటు తాము ఆయన అకౌంట్ ను డీయాక్టివేట్ చేస్తామని ప్రకటించింది. అప్పటి నుంచి ఇవి అంటేనే ఆయన మండిపడుతున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: చెంబులో ఇరుక్కుపోయిన కోతి తల మూడు రోజులుగా.తంటాలు పడుతున్న పిల్ల కోతి..వైరల్ అవుతున్న వీడియో :Monkey Viral Video.

ఆనందయ్య ఆవేదన..!ఆనందయ్య మందు పంపిణీలో గందరగోళం..అయన శిష్యులు ఎంత మంది ? :Anandaiah Corona Medicine video.

బధిరుల వార్తలు : భారత్‌లో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..థర్డ్ వెవ్ పిల్లలపై మరింత ప్రభావితం..:cases decrees in India.

డబుల్ కిక్కుతో మాస్ కా దాస్..ఫలక్ నుమా దాస్ మూవీ కి సీక్కుల్ ను ప్రకటించిన విశ్వక్ సేన్ : Falaknuma Das sequel.